Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి, విజయ నిర్మల గురించి కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా అభిమానుల గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారు. ఇక పండగ వేళ కృష్ణ ఇంట విషాదం చోటుచేసుకుంది. విజయ నిర్మల అన్నయ్య ఎస్. రవి కుమార్ నేడు కన్నుమూశారు. ఆయనే.. విజయ నిర్మల శ్రీ విజయ కృష్ణ మూవీస్ నిర్మాణ బాధ్యతలను చూసుకునేవారు. రవి కుమార్ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఇక నేడు తెల్లవారుజామున ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ పరిధిలో గల మహాప్రస్థానంలో రవికుమార్ అంతిమ సంస్కారాలు నిర్వహించారని కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక కృష్ణ ఇంటికి రవికుమార్ రాకపోకలు జరుగుతూ ఉండేవి. సినిమాల విషయంలో కూడా వీరు చాలా బాగా మాట్లాడుకునేవారని సమాచారం. ఇక మామయ్య మృతి చెందడంతో నరేష్ దుఃఖంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. మొదట తల్లిని, ఆ తరువాత పెద్ద దిక్కు కృష్ణను పోగొట్టుకున్న నరేష్.. ఇప్పుడు మేనమామను కూడా పోగొట్టుకోవడం ఎంతో విషాదకరమైన విషయమని పలువురు చెప్పుకొస్తున్నారు.