కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఇంపల్స్ కాలేజీ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రజ్ఞ రెడ్డిగా గుర్తించారు.
SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీశ్ సూసైడ్ చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో సూసైడ్ కి పాల్పడినట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారం బాగ్ ఓ కన్సుల్టెన్సీ ఆఫీస్ లో పనిచేస్తున్న గిరిజన యువతి, లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య(20) అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. అయితే... హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పీఎస్ ముందు గిరిజన సంఘాల నేతలు,కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు.
ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలైంది. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది.
బీహార్ రాష్ట్రం నలందలోని అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌గిర్‌లో జరిగిన హాకీ మ్యాచ్‌లో ఏఎస్‌ఐ డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసు కుమారుడు మహిళల హాకీ మ్యాచ్ చూడాలనుకున్నా చూడలేకపోయాడని సమాచారం. ఈ ఘటన బెనా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ట్రిపుల్ ఐటీ ముట్టడికి వెళ్తున్న ఏబీవీపీ నాయకులు అరెస్ట్‌లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ.. ఏబీవీపీ నాయకులపై పోలీసుల, బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమన్నారు.
విశాఖపట్నంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు.. కానీ, అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు.. చివరకు అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధించారు.. అంతేకాదు తమ కూతురిని హత్య చేశారని తల్లి తరపువాళ్లు ఆరోపిస్తు్నారు.
అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో 25 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలిక గురుద్వారా బాబా అటల్ రాయ్ ఏడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరులో కలకలం రేపుతోంది.. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు.. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు..