కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఇంపల్స్ కాలేజీ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రజ్ఞ రెడ్డిగా గుర్తించారు. ఆమె స్వస్థలం నిజాంబాద్. అయితే.. తోటి విద్యార్థులు ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కి ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Read Also: CM’s Cup 2024: ఈ నెల 7 నుంచి సీఎం కప్ క్రీడోత్సవాలు.. 3 లక్షల మంది క్రీడాకారులతో పోటీలు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. విద్యార్థిని మృతిపై కాలేజ్ యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మరోవైపు.. విద్యార్థిని ప్రజ్ఞ రెడ్డి మృతి పట్ల విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద చేరుకుని ధర్నా చేపట్టాయి. ఈ క్రమంలో.. కాలేజ్ క్యాంపస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు కళాశాల ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేశారు.
Read Also: PM Modi-Putin: భారత్‌లో పర్యటించండి.. పుతిన్‌కి మోడీ ఆహ్వానం..