Srishti Tuli: ఆత్మహత్యకు ముందు సృష్టి తులి-ప్రియుడి మధ్య జరిగింది ఇదే!
- ఆత్మహత్యకు ముందు సృష్టి తులి.. ప్రియుడి మధ్య వీడియో కాల్
- ఆదిత్యను బెదిరించినా మనసు మార్చుకోని ప్రియుడు
- సృష్టిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో మరో మహిళా పైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. మరోవైపు సృష్టి తులి ఆత్మహత్యకు ముందు ప్రియుడు ఆదిత్య పండిట్‌తో వీడియో కాల్‌లో మాట్లాడింది. అయితే ఫోన్‌లో చాటింగ్ డిలేట్ అయింది. ఈ సమాచారాన్ని పోలీసులు రికవరీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం ముంబైలోని మారోల్ ప్రాంతంలో ఉన్న అద్దె ఇంటిలో సృష్టి తులి-ఆదిత్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్ది రోజులు తనతోనే ఉండాలంటూ పండిట్‌ను సృష్టి తులి కోరింది. అయితే అందుకు అతడు నిరాకరించాడు. ఇలా ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఆదిత్య కారులో ఢిల్లీకి బయల్దేరి వెళ్లిపోయాడు. సృష్టి తులి.. ఆదిత్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. వీడియో కాల్‌లో ఉరి తాడు చూపించినా.. ఆదిత్య మనసు మార్చుకోలేదు. కానీ అంతలోనే ఆమె చేయాల్సిన పని చేసేసింది. ఈ ఘటనతో కంగారు పడ్డ ఆదిత్య.. తిరిగి ఇంటికి వచ్చేసరికి డోర్ వేసి ఉంది. అయితే ఆదిత్య.. మరో మహిళా పైలట్ సాయంతో డోర్ ఓపెన్ చేసి చూడగా.. మెడకు కేబుల్ వైర్ చుట్టుకుని ఉంది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. పైలట్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులకు ఆదిత్య ఫోన్ చేసి సమాచారం అందించాడు. అయితే సృష్టి తులి మరణవార్త తెలిసి షాక్ అయ్యారు.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
ఇదిలా ఉంటే సృష్టి తులితో ఆదిత్య చేసిన చాటింగ్‌ను తొలగించాడు. తులి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు రావడంతో చాటింగ్‌ను పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే తాను కూడా సూసైడ్ చేసుకుంటానని ఆదిత్య.. తులిని హెచ్చరించినట్లుగా పోలీసులు గుర్తించారు. కానీ ఆమె అన్నంత పనే చేసింది. ఆదిత్య ఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులకు పంపించారు. తులి మరణానికి ముందు ఇద్దరి మధ్య దాదాపు 10-11 ఫోన్ కాల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సృష్టి ఫోన్‌లో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అవి ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉంది. ఇక సృష్టి ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు ఆదిత్య పదే పదే ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సృష్టి ఎలాంటి సూసైడ్ నోట్ రాయకుండానే ప్రాణాలు తీసుకుంది.
మరోవైపు సృష్టి ఆత్మహత్యకు 15 నిమిషాల ముందే తల్లి, అత్తతో ఉల్లాసంగా మాట్లాడింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. అయితే ఆదిత్య వేధింపులు కారణంగానే సృష్టి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండేళ్ల క్రితం ఢిల్లీలో పైలట్ శిక్షణ కేంద్రంలో మొదలైన స్నేహం.. ప్రేమగా మారి బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఆదిత్య.. సృష్టిని వేధిస్తున్నాడని.. ఈ ఏడాది మార్చిలో గురుగ్రామ్‌లో పార్టీలో సృష్టి నాన్ వెజ్ తిన్నాదని విపరీతంగా దుర్బాషలాడాడని.. అంతేకాకుండా మార్గమధ్యలో కారులోంచి దింపేసి వెళ్లిపోయాడని.. ఒంటరిగా ఇంటికెళ్లిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బహిరంగంగానే సృష్టిని అవమానించేవాడని వాపోయారు. ఓ రోజు అయితే సృష్టి మీద కోపంతో మరో వాహనాన్ని ఢీకొట్టాడని గుర్తుచేశారు. ఇక దీపావళికి సృష్టి తులి అకౌంట్ నుంచి రూ.65,000 ఆదిత్య ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. సృష్టి పైలట్‌గా ఎంపికవ్వడం.. అతడు సెలెక్ట్ కాకపోవడంతో అప్పటినుంచి సృష్టిపై అసూయ పడుతూనే ఉన్నాడని బాధిత కుటుంబం కన్నీటిపర్యంతం అయింది.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!