Doctor commits suicide: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ నగరంలో 35 సంవత్సరాల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు, ఆయన తన భార్య సుమన్‌పై ఆరోపణలు చేసిన సుసైడ్ నోట్ లో తెలిపారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరు లోని అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తు చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సుసైడ్ నోట్ లో ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధానంగా నిలిచాయి. డాక్టర్ అజయ్ కుమార్…
షేర్ మార్కెట్ కొంప ముంచింది. ఓ ఇంటి యజమానికి షేర్ మార్కె్ట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. అప్పుల బాధ భరించలేక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య ( 60), శ్రీదేవి (50) దంపతులకు ఇద్దరు సంతానం. మొండయ్య అప్పులు చేసిన మరీ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా…
ఇటీవల కాలంలో లోన్ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్‌లైన్ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్‌లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సీపట్నంలోని కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు
High Tension: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో గల నారాయణ కళాశాల యజమాన్యం మూడు రోజుల సెలవులు ప్రకటించారు. కాలేజ్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఇంపల్స్ కాలేజీ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రజ్ఞ రెడ్డిగా గుర్తించారు.
SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీశ్ సూసైడ్ చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో సూసైడ్ కి పాల్పడినట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారం బాగ్ ఓ కన్సుల్టెన్సీ ఆఫీస్ లో పనిచేస్తున్న గిరిజన యువతి, లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య(20) అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. అయితే... హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పీఎస్ ముందు గిరిజన సంఘాల నేతలు,కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు.
ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలైంది. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది.