High Tension: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో గల నారాయణ కళాశాల యజమాన్యం మూడు రోజుల సెలవులు ప్రకటించారు. లెక్చరర్ ఒత్తిడి తట్టుకోలేక నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బనావత్ తనీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి నారాయణ కళాశాల దగ్గర విద్యార్థి బంధువులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం శోచనీయం. ఇక, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తుండటంతో.. ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు.
Read Also: TG High Court: నేటి వరకు ఏటూరునాగారంలోనే మావోయిస్టుల మృతదేహాలు..
కాగా, పోస్టుమార్టం కోసం విద్యార్థి బనావత్ తనీష్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఇక, తమ కుమారుడి సూసైడ్ కు నారాయణ కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజ్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజీ దగ్గరకు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.