బీహార్ రాష్ట్రం నలందలోని అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌గిర్‌లో జరిగిన హాకీ మ్యాచ్‌లో ఏఎస్‌ఐ డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసు కుమారుడు మహిళల హాకీ మ్యాచ్ చూడాలనుకున్నా చూడలేకపోయాడని సమాచారం. ఈ ఘటన బెనా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
READ MORE: AUS vs IND: భారత్‌ను అడ్డుకోవడం కష్టమే.. ఆస్ట్రేలియాకు ఆడమ్ హెచ్చరికలు!
మృతి చెందిన యువకుడిని మాధేపురా జిల్లాకు చెందిన ధర్మేష్ కుమార్ కుమారుడు రూపేష్ కుమార్ (20)గా గుర్తించారు. ధర్మేష్ కుమార్ బెనా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా హాకీ మ్యాచ్ సందర్భంగా స్పోర్ట్స్ అకాడమీలో విధుల నిమిత్తం వెళ్లారు. అంతలోపే ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా రూపేష్ కుమార్ తాత కప్లేశ్వర్ దాస్ మాట్లాడుతూ.. “బుధవారం తన తండ్రి రాజ్‌గిర్ క్రీడా మైదానంలో విధులు నిర్వహిస్తున్నాడు. తన డ్యూటీ ముగించుకుని, అతను క్వార్టర్ నంబర్ 3కి తిరిగి వచ్చాడు. ఇంట్లో ఉన్న తన కొడుకును పిలిచి, తలుపు తెరవమని అడిగాడు. ఎంత శబ్ధం చేసిన కుమారుడు స్పందించకపోవడంతో సమీపంలోని పోలీసులు కలిసి తలుపులు పగులగొట్టారు. ఇంట్లోకి రాగానే ఆ గది దృశ్యం చూసి చలించిపోయాడు.” అని పేర్కొన్నారు.
READ MORE: Patnam Narender Reddy Wife: పోలీసులపై చర్యలు తీసుకోండి.. హైకోర్టులో పట్నం శృతి పిటిషన్..
అయితే.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అతను మ్యాచ్ చూడటానికి మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ ఎందుకో ఇంటికి తిరిగి వచ్చి ఈ స్టెప్ తీసుకున్నాడు. ఈ కేసులో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు బేనా పోలీస్ స్టేషన్ ఇంచార్జి సామ్రాట్ దీపక్ తెలిపారు. గదిలోంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. ఆత్మహత్యకు గల కారణాలు, ఇతర వాస్తవాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.