హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామంతాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ పై నుండి దూకి సూసైడ్ కు పాల్పడింది. అయితే.. ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హరితగా గుర్తించారు. ఆమె.. రామంతాపూర్‌లోని DSL మాల్‌లో ఉద్యోగం చేస్తుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ పోలీస్ కానిస్టేబుల్ బుక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తాజాగా నేడు చికిత్స పొందుతూ ఆయన మరణించారు. జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో బుక్యా సాగర్ విధులు నిర్వర్తించారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో మరో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త.. కన్న ఇద్దరు కుమారులు ఒకేసారి మృతిచెందడంతో.. రెండు రోజులు తీవ్ర మనస్థాపంతో ఉన్న భార్య దేవి.. చివరకు తాను కూడా ప్రాణాలు విడిచింది..
ఆ మహిళకు ఏం ఆపద, కష్టమొచ్చిందో.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెజవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి దగ్గర వండౌడ్ కాల్వలో ఇద్దరు పిల్లలతో సహా కాల్వలోకి దూకింది మహిళ. ఈ క్రమంలో.. అక్కడున్న స్థానికులు గమనించి ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే.. ఆ చిన్నారిని హాస్పటల్‌కు తరలించే లోపే…
Delhi : ఢిల్లీలోని రంగపురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. 50 ఏళ్ల హీరా లాల్ తన కుటుంబంతో కలిసి రంగ్‌పురి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించాడు.
ఆర్థికంగాను, స్థలం విషయంలోనూ స్నేహితులు మోసానికి పాల్పడ్డారని మనస్తాపం చెంది, తన చావుకు స్నేహితులు కారణమని సెల్ఫీ వీడియో తీసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల మందమర్రికి చెందిన రాజేష్(32) మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లో తన భార్య కుష్మల తో కలిసి నివసిస్తూ, ఐటి కన్సల్టెన్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఓ స్థలం విషయమై మాట్లాడేందుకు వెళ్తున్నానని…
Suicide Pod: స్విట్జర్లాండ్‌లో 64 ఏళ్ల అమెరికన్ మహిళ ‘సూసైడ్ పాడ్’ ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంది. ప్రపంచంలో అలా చేసిన మొదటి వ్యక్తి ఆమె. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే ఆత్మహత్యకు సహకరించారనే అనుమానంతో, అనేక మందిని అరెస్టు చేశారు అధికారులు. ఈ సూసైడ్ క్యాప్సూల్ ఇంతకు ముందెన్నడూ ఉపయోగించబడలేదు. అందిన సమాచారం ప్రకారం, ఈ సూసైడ్ క్యాప్సూల్‌ను సోమవారం మొదటిసారి ఉపయోగించారు. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నామని, ఆత్మహత్యకు సహకరించారనే అనుమానంతో ప్రాసిక్యూటర్లు…
మహారాష్ట్ర పూణేలోని చర్హోలీ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయిన కొద్ది రోజులకు తిరిగి వచ్చాడు. చనిపోయిన వ్యక్తి ఎలా వచ్చాడు? అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.. పూణేలోని చర్హోలీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మృతదేహం పొలాలు దున్నేందుకు ఉపయోగించే రోటావేటర్‌లో ఇరుక్కుపోయి ఛిద్రమైంది. మొండెం పైనుంచి తల కూడా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుస్తులను గుర్తించగా మృతదేహం…