హైదరాబాద్ లాలాగూడ పీస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం బాగా లేక తల్లి లక్ష్మి మృతి చెందింది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్ రాశాడు.
ప్రేమలో హార్ట్‌బ్రేక్ కారణంగా ఓ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో 20 మంది ఫాలోవర్లు చూస్తుండగా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనల ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త సంవత్సరం వేళ విషాదం చోటు చేసుకుంది. క్లాస్ మెట్కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బాలుడు.. సాయంత్రం సూసైడ్ చేసుకున్న వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భీముని మల్లా రెడ్డి గ్రామానికి చెందిన శివ కిషోర్ (17) అనే 10వ తరగతి విద్యార్థి.. అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. ఈ క్రమంలో…
భూమ్మీద.. భార్యాభర్తల బంధం అపురూపమైనది. అందమైనది. ఎక్కడెక్కడో పుట్టిన అబ్బాయి.. అమ్మాయి.. పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారు. ఆనాటి నుంచి చచ్చేంత వరకూ ఒక్కటిగా జీవిస్తుంటారు. ఇక సంసారం అన్నాక.. కష్టాలు.. ఒడిదుడుకులు ప్రతి కుటుంబంలో ఉంటాయి.
నేటి తరం పిల్లల తీరుపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుతున్నా.. భవిష్యత్ గురించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
బెంగళూరులోని ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు కేసు మరవక ముందే మరో కేసు బయటకు వచ్చింది. అతుల్ సుభాస్ మాదిరిగానే ఓ వ్యక్తి తన భార్య తనను వేధిస్తోందని వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ దారుణాలకు సోషల్ మీడియా కారణం కావడం అత్యంత బాధాకరం. తాజాగా సోషల్ మీడియా ప్రేమ ఓ ఫోక్ సింగర్ ప్రాణం తీసింది.
Loan App Harassment: ప్రైవేట్ యాప్‌లో తీసుకున్న రుణం తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం, మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (28) అనే వ్యక్తి మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంగాధర్ గతంలో ఆన్లైన్ ద్వారా రూ. 1.20 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ…
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బేతవోలులో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 12ఏళ్ల చిన్నారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలియరాని కారణాలతో బాలుడు సాయి హర్ష ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లి ఉద్యోగ విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.