Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు గ్లామరస్ రోల్స్‌తో కుర్రకారుని మైమరపించిన రవీనా ఠాండన్ ఇప్పుడు కంటెంట్ డ్రివెన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. 2024లో లీగల్ డ్రామాగా వచ్చిన ‘పట్నా శుక్లా’ చిత్రంలో ఒక సాధారణ గృహిణిగా, అలాగే న్యాయం కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆమె కనబరిచిన అభినయానికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక అదే ఏడాది డిస్నీ హాట్‌స్టార్‌లో వచ్చిన ‘కర్మ కాలింగ్’ థ్రిల్లర్ సిరీస్‌లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో సత్తా చాటి రవీనా జియో సినిమాలో విడుదలైన ‘గుడ్చడి’ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం రవీనా ఠాండన్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా, అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ కామెడీ మూవీ వెల్కమ్ టు ది జంగిల్లో రవీనా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలోనూ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ‘లాయర్’ అనే విభిన్నమైన ప్రాజెక్ట్‌లోనూ రవీనా నటించనున్నారు. పాత్ర ఏదైనా సరే తనదైన అద్భుతమైన పెర్ఫార్మన్స్తో మెప్పించే రవీనా ఠాండన్, అటు కమర్షియల్ చిత్రాలతో పాటు ఇటు ఓటీటీ కంటెంట్‌ను కూడా సమంగా బ్యాలెన్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. 2006లో విడుదలై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన మాలామాల్ వీక్లీ మూవీ సీక్వెల్లోను నటించనుంది. ఇలా కూతురు రాషా తడానీ కంటే జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ రవీనా ఠాండన్.
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!