Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharman: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 173వ కోలీవుడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధర్మన్’ (Dharman). లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ఒక పవర్ఫుల్ డాక్టర్ పాత్రలో నటిస్తుండటంతో, చిత్ర యూనిట్ ఈ సినిమాకు ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేసింది. ఈ మూవీకి సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్ నేడే (ఆగస్టు 13, 2026) చెన్నైలో అఫీషియల్‌గా ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ న్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రజనీకాంత్ సరసన సిమ్రాన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ పనులను శరవేగంగా ముగించి, ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ చివరిలో లేదా 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను యువ దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో మొదలైంది. ఈ ప్రాజెక్ట్ రెండో షెడ్యూల్ లో రజనీకాంత్ పాల్గొనే కీలక సన్నివేశాల షూట్ చేయనున్నట్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఎలాంటి విరామం లేకుండా షూటింగ్‌ను వేగంగా కొనసాగిస్తోంది. దీంతో సినిమాను నిర్ణయించిన సమయానికి పూర్తి చేసే దిశగా నిర్మాణ సంస్థ ముందుకు సాగుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ వైద్యుడి పాత్రలో కనిపించనుండటం మరో ఆసక్తికరమైన అంశం. సాధారణంగా యాక్షన్, మాస్ పాత్రల్లో సూపర్‌స్టార్‌ను చూసే అభిమానులకు ఈ పాత్రలో ఆయన కొత్తగా కనిపించే అవకాశం ఉంది. వైద్యుడి నేపథ్యంతో కథ ఎలా సాగుతుంది, ఆ పాత్రలో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయి, దర్శకుడు అశ్వత్ మరిముత్తు రజనీకాంత్‌ను ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నాయి.
Also Read
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు సిమ్రాన్, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరి పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నిర్మాణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి 2027 పొంగల్ పండుగ సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ రెండో షెడ్యూల్లోకి అడుగుపెట్టడంతో ఇకపై సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు వరుసగా వచ్చే అవకాశం ఉంది. రజనీకాంత్‌ను వైద్యుడి పాత్రలో యువ దర్శకుడు ఎలా ఆవిష్కరించబోతున్నారన్నది తెలియాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!