Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma’s Big Statement on 2027 World Cup: 2027 వన్డే ప్రపంచ కప్‌పై తన మనసులోని మాటను టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ బయటపెట్టాడు. 2023 ప్రపంచ కప్‌లో భారత్ టైటిల్ గెలవలేకపోయిన బాధ తనలో ఇంకా ఉందని చెప్పాడు. వన్డే ప్రపంచ కప్‌ను గెలవాలన్నదే తన లక్ష్యమని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. 2027 ప్రపంచ కప్ తనకు చివరి అవకాశం అని, ఆ తర్వాత ఆడలేను అని పేర్కొన్నాడు. 2027 ప్రపంచ కప్‌లో తాను ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.
నా ఆలోచనల్లో ఉంది:
విమల్ కుమార్‌తో జరిగిన సంభాషణలో రోహిత్ శర్మకు 2027 ప్రపంచ కప్‌పై ప్రశ్న ఎదురైంది. 2023లో చేజారిన ప్రపంచ కప్‌ను వచ్చే టోర్నీలో గెలుచుకోవాలనే ఆలోచన ఉందా?.. 2027 వరల్డ్ కప్ ఆడాలని అనుకుంటున్నారా?.. రిటైర్మెంట్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? అని అడగగా.. హిట్‌మ్యాన్ సమాధానం ఇచ్చాడు. ‘కచ్చితంగా 2027 ప్రపంచ కప్ నా ఆలోచనల్లో ఉంది. 2023లో మనం సాధించలేకపోయిన దాన్ని నెరవేర్చాలని ఉంది. కప్ గెలిస్తే చాలా గొప్పగా ఉంటుంది. ప్రపంచ కప్ గెలవాలన్నది నా కోరిక. ఇది ఇప్పటిది కాదు.. చిన్నప్పుడే అనుకున్నా. అందుకు నా ఫిట్‌నెస్‌పై కూడా ఎంతో శ్రమించాను. నేను టీ20 ప్రపంచ కప్ గెలిచాను. కానీ వన్డే ప్రపంచ కప్ పూర్తిగా బిన్నం’ అని రోహిత్ చెప్పాడు.
Also Read
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
నాకు చివరి అవకాశం:
వన్డే ప్రపంచ కప్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ’50 ఓవర్ల ప్రపంచ కప్ అత్యంత కఠినమైన టోర్నీల్లో ఒకటి. దానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అందుకే 2027 ప్రపంచ కప్ ఖచ్చితంగా నా ఆలోచనల్లో ఉంది. ఇది నాకు చివరి అవకాశం. ఆ తర్వాత ఇంకో ప్రపంచ కప్ ఆడలేను. ఆ అవకాశం కూడా నాకు ఉండదు. అందుకే 2027 ప్రపంచ కప్ గెలవడానికి నా వంతు కృషి చేస్తా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. 2023 ప్రపంచ కప్‌లో టీమిండియా అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరినప్పటికీ.. తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌ను కోల్పోయింది. ఆ టోర్నీలో రోహిత్ దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుత ఆరంభాలు ఇచ్చాడు. అయితే చివరికి ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోలేకపోవడం హిట్‌మ్యాన్ కెరీర్లో అసంపూర్తిగా మిగిలింది.
ఫిట్నెస్, ఫామ్ కీలకం:
ఇప్పటికే రోహిత్ టెస్టు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేకంగా కష్టపడుతున్నానని స్వయంగా చెప్పి.. 2027 ప్రపంచ కప్ వరకు ఆడతానని స్పష్టం చేశాడు. ప్రపంచ కప్ నాటికి రోహిత్‌కు 39 ఏళ్లు వస్తాయి. వయసు, ఫిట్నెస్, ఫామ్ వంటి అంశాలు అతడి ఎంపికలో కీలకంగా మారనున్నాయి. అయినప్పటికీ ప్రపంచకప్ గెలవాలన్న తన లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నానని రోహిత్ స్పష్టం చేశాడు. మరి హిట్‌మ్యాన్ కల నెరవేరుతుందా? లేదా అనేది 2027లో తేలనుంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..