SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీశ్ సూసైడ్ చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో సూసైడ్ కి పాల్పడినట్లు సమాచారం. అయితే, ఏటూరునాగారంలో ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే ఆయన ఈ సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’
అయితే, ఎస్ఐ హరీశ్ ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత వారం వాజేడులో మావోయిస్టుల దాడిలో అన్నదమ్ములు చనిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ల పేరుతో ఇద్దరిని నరికి చంపడంతో వాజేడు ఎస్ఐపై ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు వారు చెబుతున్నారు. కాగా, ఏటూరు నాగారం మండలం చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య పోరులో ఏడుగురు మావోయిస్టులు చనిపోగా.. రెండు ఏకే 47 తుఫాకులతో పాటు మరో ఐదు ఆయుధాలను పోలీసులు హస్తగతం చేసుకున్నారు. కాగా, మరణించిన ఏడుగురు మృతదేహాలకు ఈరోజు పోస్ట్ మార్టం చేయనున్నారు.