CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Ashwin Hints CSK Head Coach: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ ఎవరన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి హింట్ లేదు. 2026 ఐపీఎల్ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత సుదీర్ఘకాలం జట్టుకు సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో సీఎస్కే తన బంధాన్ని తెంచేసుకుంది. దీంతో వచ్చే సీజన్‌కు కొత్త కోచ్ కోసం ఫ్రాంచైజీ అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్, సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇంగ్లండ్‌ను 2019 వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్ అశ్విన్ సంకేతాలు ఇచ్చాడు. మోర్గాన్ పేరు ప్రస్తుతం కోచ్ రేసులో బలంగా వినిపిస్తోందని యాష్ అభిప్రాయపడ్డాడు. కోచింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోయినా.. కెప్టెన్‌గా, అంతర్జాతీయ క్రికెటర్‌గా అతడికి ఉన్న అనుభవం సీఎస్కేకు ఉపయోగపడొచ్చని భావిస్తున్నారు. తన యూట్యూబ్ ఛానల్లో ఆర్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఇయాన్ మోర్గాన్ సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా రావచ్చని నేను అందుకుంటున్నా. రేసులో అతడి పేరు బలంగా వినిపిస్తోంది. ప్రారంభ స్థాయి చర్చలు జరుగుతున్నాయని నాకు అనిపిస్తోంది. ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి. మోర్గాన్ ఈ ఏడాదే బాధ్యతలు తీసుకుంటాడా?.. లేదా మరెవరైనా ముందుగా జట్టును నిర్మించి, మోర్గాన్ తర్వాతి దశలో బాధ్యతలు చేపడతాడా? చూడాలి’ అని చెప్పాడు.
Also Read
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
- INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
- Ishan Kishan: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
- Ind Vs Pak: పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్‌ల్లో 14 సార్లు భారత్‌దే గెలుపు.. నేడు మరో సమరం..
మోర్గాన్‌కు ఐపీఎల్‌లోనూ కెప్టెన్సీ అనుభవం ఉంది. 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. 2019లో ఇంగ్లండ్ జట్టుకు వన్డే ప్రపంచ కప్‌ను అందించాడు. అయితే ఇప్పటివరకు హెడ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకపోవడం అతడికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశం. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పేరు కూడా సీఎస్కే హెడ్ కోచ్ రేసులో ఉన్నట్లు ఆర్ అశ్విన్ తెలిపాడు. అయితే ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్లతో అతడికి ఉన్న బాధ్యతల కారణంగా వెంటనే సీఎస్కేకు రావడం కష్టమని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం సీఎస్కే జట్టు మార్పు దశలో ఉందని ఆర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కొత్త కోచ్‌ను నియమించి మొత్తం వ్యవస్థను మార్చడం కంటే.. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో మరో ఏడాది జట్టును స్థిరీకరించడం సరైన మార్గమని సూచించాడు. ‘ధోనీ నాయకత్వంలో మిగతా వాళ్లు కలిసి పనిచేస్తారని నాకు బలమైన నమ్మకం ఉంది. వ్యక్తిగతంగా అదే సరైన మార్గమని నేను భావిస్తున్నాను. కొత్త కోచ్ నియామకం కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. మరోవైపు మెగా వేలం కూడా సమీపంలో ఉంది. కనీసం వచ్చే ఏడాది వరకు ధోనీ నాయకత్వంలో వ్యవస్థను స్థిరపరిచి, ఆ తర్వాత మోర్గాన్ వంటి వ్యక్తికి హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఇయాన్ మోర్గాన్, బ్రెండన్ మెకల్లమ్ వంటి పేర్లు చర్చలో ఉన్నప్పటికీ.. సీఎస్కే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్‌గా మోర్గాన్‌కు ఉన్న నాయకత్వ అనుభవం, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ వంటి అంశాలు అతడిని ప్రత్యేక అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. మరోవైపు ధోనీ భవిష్యత్తుపైనా అనిశ్చితి కొనసాగుతోంది. ఒకవేళ ధోనీ ఆటగాడిగా కాకుండా జట్టులో కీలక పాత్రలో కొనసాగుతూ.. కొత్త కోచ్ రాక వరకు వ్యవస్థను నడిపిస్తే, సీఎస్కేలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టే అవుతుంది. ఫ్లెమింగ్ స్థానంలో ఎవరు వస్తారు?.. ధోనీ పాత్ర ఏంటి?.. మోర్గాన్ బాధ్యతలు చేపడతాడా?.. అనే అంశాలపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!