HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
- HONOR Robot Phoneను చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్
- డిస్ప్లే: 6.31 అంగుళాల 1.5K LTPO OLED ఫ్లాట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్..
- స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో తొలిసారిగా Titanium Alloy Gimbal Imaging System
- ప్రధాన కెమెరా: 200MP 1/1.28-అంగుళాల సెన్సార్, f/1.6 అపెర్చర్, OIS
- టెలిఫోటో: 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 2.7x ఆప్టికల్ జూమ్, 200x డిజిటల్ జూమ్ సపోర్ట్.
- అల్ట్రా-వైడ్: 50MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 2.5cm మాక్రో ఫోటోగ్రఫీ సపోర్ట్.
- సెల్ఫీ కెమెరా: 50MP ఫ్రంట్ కెమెరా అందించారు.
- ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Elite Gen 5 3nm మొబైల్ ప్లాట్‌ఫామ్..
- రెసిస్టెన్స్: IP54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Robot Phone: హానర్ (HONOR) నుండి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ “రోబోట్ ఫోన్ (Robot Phone)”ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. కెమెరా టెక్నాలజీ, సినిమాటిక్ వీడియో రికార్డింగ్, ప్రో-లెవల్ ఇమేజింగ్‌తో పాటు AI ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ఫోన్ రూపుదిద్దుకుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలోనే మొదటి సారిగా టైటానియం అల్లోయ్ గింబల్ ఇమేజింగ్ సిస్టం (Titanium Alloy Gimbal Imaging System)ను అందించారు.
డిస్ప్లే:
ఈ రోబోట్ ఫోన్లో 6.31 అంగుళాల 1.5K LTPO OLED ఫ్లాట్ డిస్ప్లే ఉంది. ఇది 2640 × 1216 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్‌ను కలిగి ఉంది. స్క్రీన్ గరిష్ఠంగా 6,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. అలాగే 2,000 నిట్స్ HBM బ్రైట్నెస్, 4,320Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి. బయట ఎండలో స్క్రీన్ స్పష్టంగా కనిపించేందుకు యాంటీ-రిఫ్లెక్టివ్ (AR) ఫిల్మ్‌ను కూడా ఉపయోగించారు.
Also Read
- 93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
- లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
- స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
కెమెరా సిస్టమ్:
హానర్ రోబోట్ ఫోన్లో ప్రధాన ఆకర్షణ “కెమెరా సిస్టమ్”. ఇందులో ఇండస్ట్రీలోనే తొలి టైటానియం అల్లోయ్ గింబల్ ఆర్కిటెక్చర్ ను పరిచయం చేసింది. ఏరోస్పేస్-గ్రేడ్ టైటానియం అల్లాయ్‌తో తయారు చేసిన ఈ గింబల్ నిర్మాణం సాధారణ స్మార్ట్‌ఫోన్ గింబల్స్తో పోలిస్తే 65% తక్కువ వాల్యూమ్‌ను ఆక్రమిస్తుంది. ఇందులోని టైటానియం అల్లాయ్ గింబల్ మోటార్ సెకనుకు 360 డిగ్రీల వరకు రొటేషన్ వేగాన్ని అందిస్తుంది. దీంతో కదులుతున్న సమయంలో కూడా కెమెరాను స్థిరంగా ఉంచుతూ ప్రత్యేకమైన షాట్లను క్యాప్చర్ చేయవచ్చు.
ఫోన్లో ప్రధాన కెమెరాగా 200MP 1/1.28-అంగుళాల సెన్సార్ ను ఉపయోగించారు. ఇది f/1.6 అపెర్చర్, OISతో వస్తుంది. దీనికి తోడు 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. ఇందులో 2.5cm మాక్రో ఫోటోగ్రఫీ సపోర్ట్ కూడా ఉంది. మరో ముఖ్యమైన కెమెరా 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్. ఇది 1/1.4-అంగుళాల పెద్ద సెన్సార్, 2.7x ఆప్టికల్ జూమ్, f/2.6 అపెర్చర్, OISతో వస్తుంది. ఇది డిజిటల్ జూమ్ 200x వరకు ఉంటుంది. ముందువైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 90 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, f/2.0 అపెర్చర్‌తో వస్తుంది.
ప్రాసెసర్:
ఈ ఫోన్లో Qualcomm ఫ్లాగ్షిప్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 3nm మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను అందించారు. 4.6GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ CPUతో పాటు Adreno 840 GPU ఉంది. ఇది 12GB, 16GB RAM ఆప్షన్లలో, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఫోన్ MagicOS 10 ఆధారిత Android 16పై పనిచేస్తుంది.
Welcome HONOR ROBOT PHONE in China 🇨🇳
Price
16GB + 1TB CNY 12,999
12GB + 51GB CNY 9,999 https://t.co/w9riYa1baj pic.twitter.com/A1DMrVzGUy— RAIHAN HAN (Informasi Gadget) (@raihanhan121) August 12, 2026
ARRI టెక్నాలజీ:
హానర్ రోబోట్ ఫోన్ వీడియో రికార్డింగ్ సామర్థ్యాల్లో కూడా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది 10-bit ARRI LogC3, ARRI Wide Gamut 3, ARRI CINEMA మోడ్‌లో రియల్‌టైమ్ ARRI Looks ప్రివ్యూకు సపోర్ట్ చేస్తుంది. రికార్డ్ చేసిన ఫుటేజ్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయిన DaVinci Resolve వంటి ప్లాట్‌ఫామ్‌లలో స్టాండర్డ్ ARRI LUTలను ఉపయోగించి ఎడిట్ చేసుకునేలా ఉంటుంది. RAW డొమైన్‌లోనే నాయిస్ రిడక్షన్ చేయడంతో పాటు 14-bit 4:4:4 డేటాను ప్రాసెస్ చేసి 10-bit LogC3, 4:2:2 వీడియోగా అవుట్‌పుట్ చేస్తుంది. AI నాయిస్ రిడక్షన్ ద్వారా వీడియో సిగ్నల్-టు-నాయిస్ రేషియోను 8dB వరకు మెరుగుపరచవచ్చని హానర్ తెలిపింది. AI డైనమిక్ రేంజ్ ఆప్టిమైజేషన్ ద్వారా 14 స్టాప్ల వరకు డైనమిక్ రేంజ్‌ను అందిస్తుంది.
YOYO Robot Modeతో AI కెమెరా:
MagicOS ఆధారంగా పనిచేసే YOYO Robot Mode ఈ ఫోన్లో మరో ప్రత్యేక ఫీచర్. ఇందులోని మోటరైజ్డ్ గింబల్‌ను ఆటోమేటిక్‌గా పనిచేసే కెమెరా క్రూగా మార్చుకోవచ్చు. టిల్ట్ లాక్, ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV), FPV వర్టికల్, AI స్పిన్ షాట్ వంటి మోషన్ మోడ్లు ఉన్నాయి. మల్టీ మోడల్ పెరిసిప్షన్, స్పటిల్ అవర్నెస్, వాయిస్ సోర్స్ లోకలైజేషన్, జెస్చర్ రెకగ్నిషన్ వంటి టెక్నాలజీల సహాయంతో కెమెరా యూజర్ లేదా సబ్జెక్ట్‌ను ఆటోమేటిక్‌గా ఫ్రేమ్‌లో ఉంచుతుంది. వ్లాగింగ్, లైవ్ స్ట్రీమింగ్ లేదా వీడియో కాల్స్ సమయంలో యూజర్ చేతులతో కెమెరాను ఆపరేట్ చేయకుండానే జెస్చర్ల ద్వారా కెమెరా ఆర్మ్‌ను కంట్రోల్ చేయవచ్చు.
Poking its head out to say hello to the world. 🤖👋
Meet the #HONORRobotPhone at our global launch event on August 12.
The future of mobile tech is finally here.#HONOR pic.twitter.com/4YxcsAb3xs— HONOR (@Honorglobal) August 11, 2026
7,060mAh బ్యాటరీ:
ఇందులో 7,060mAh బ్యాటరీ ఉంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, Wi-Fi 7, Bluetooth 6.0, NFC, USB Type-C USB 3.2 Gen1, GPS, Galileo, GLONASS, BeiDou, QZSS, NavIC వంటి సిస్టమ్‌లకు సపోర్ట్ ఉంది. ఫోన్‌కు IP54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఉంది.
ధర:
చైనాలో హానర్ రోబోట్ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. ఫోన్‌కు చైనాలో ఇప్పటికే ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులకు లైఫ్‌టైమ్ ఉచిత YOYO AI మెంబర్షిప్ SVIP ప్రయోజనాలతో పాటు మాగ్నెటిక్ స్టాండ్, Lanyard, 120W అల్-ఇన్-వన్ చార్జర్ ఉన్న యాక్సెసరీ గిఫ్ట్ ప్యాక్‌ను కూడా అందిస్తున్నారు. వీటి ధరలు..
* 12GB + 512GB: 9,999 యువాన్ (రూ.1.41 లక్షలు).
* 16GB + 1TB: 12,999 యువాన్ (రూ.1.84 లక్షలు).
తాజావార్తలు
-
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
-
Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!
-
Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!