డిగ్రీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆ కోర్సులు తమకు నచ్చకుంటే వేరే కోర్సుల్లో చేరేందుకు మూడు రోజుల గడువును ఇచ్చింది. తెలంగాణ రాష్ర్టంలో ఇప్పటికే దోస్త్ ద్వారా కాలేజీల్లో చేరిన డిగ్రీ విద్యార్థులు మూడోవిడత కింద కోర్సులను మార్చుకునేందుకు ఇంట్రా కాలేజీ స్లైడింగ్‌కు ఉన్నత విద్యామండలి అవకాశం ఇచ్చింది. Also read: పీహెచ్‌డీలో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీన్లో భాగంగా ఈ నెల15 నుంచి 17 వరకు విద్యార్థులు వెబ్…
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను రాష్ర్టహైకోర్టు కొట్టివేసింది. జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. తల్లుల ఖాతాలో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. రాష్ర్ట ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తు హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు పిటిషన్ వేయగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.…
మనదేశంలో గురువును దేవుడితో సమానంగా పూజిస్తారు. విద్యాబుద్దులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు గురువు బాటలు వేస్తారు. అలాంటి గురువులను ఇప్పుడు విద్యార్థులు హెళన చేస్తున్నారు. అవమానిస్తున్నారు. కర్ణాటకలోని దావణగెరే జిల్లాలోని చన్నగిరి టౌన్‌లో నల్లూర్ ప్రభుత్వ పాఠశాల ఉన్నది. ఆ పాఠశాలలోని తరగతి గదిలోకి వచ్చిన ఓ టీచర్‌కు క్లాస్‌రూమ్‌లో గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. విద్యార్థులు క్రమశిక్షణను పాటించాలని చెప్పాడు. Read: సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణం దిశగా ఇండియా… దీంతో ఆగ్రహించిన విద్యార్థులు…
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలల విలీనం పై మరోసారి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాఠశాలల విలీనం పై కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చిన విషయం తెల్సిందే.. అయితే తాజాగా రాష్ర్టంలో100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలో నుంచి ప్రాథమిక పాఠశాలల 3,4,5 తరగతులను విలీనం చేయవద్దని విద్యాశాఖ నిర్ణయించింది. ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య పాఠశాలలో కలపాలని, గిరిజన సంక్షేమ పాఠశాలలను అసలు విలీనం చేయవద్దని తెలిపింది. 20 మంది కన్నా తక్కువ…
తెలంగాణ సీపీజీఈటీ-2021లో మొదటి విడతలో సీట్లు సాధించిన వారు కళాశాలలో రిపోర్టు చేయాల్సిన తేదిలను అధికారులు పొడిగించారు. రాష్ర్టంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ఉతీర్ణులై తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థులు కళాశాలల్లో ఈనెల15వ తేది వరకు రిపోర్టు చేయవచ్చని ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు. కాగా అంతకముందు ఈ గడువు ఈనెల10 వరకు ఉండగా మరో 5 రోజులు పాటు పొడిగించినట్లు…
యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని కిరాతకంగా కొట్టి చంపిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణ శిక్ష విధించింది బంగ్లాదేశ్ కోర్టు. 2019లో నీటి పంపకాలకు సంబంధించి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. దీనిని విమర్శిస్తూ అబ్రర్ ఫహద్ ఫేస్బుక్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అబ్రర్ ఫహద్ తీరుపై అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం ఆగ్రహించింది. అబ్రర్ ఫహద్ క్రికెట్ బ్యాట్లు, ఇతర వస్తువులతో 25 మంది విద్యార్థులు తీవ్రంగా…
మోడల్ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు అందజేసే భోజనం విషయంలో రాజీ పడబోమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుందని ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ఎక్కడైనా మెనూ సరిగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా ఖాజీపేట పాఠశాలల్లో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఏం…
కరీంనగర్లో కరోనా కలకలం కొనసాగుతుంది. బొమ్మకల్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు, స్టాఫ్‌కు మొత్తం 49 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాలేజీలో మొత్తం 1000 మంది ఉండగా, మరో 100 మంది విద్యార్థుల శాంపిల్స్‌ను టెస్టులకు వైద్య సిబ్బంది పంపించారు. 49 మందికి పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కళాశాల యాజమాన్యం ఆందోళనలో ఉంది. దీంతో కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వెంటనే వైద్య ఆరోగ్య శాఖను…
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల గురించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో 14 మంది విద్యార్థులు చేరారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతోనే అస్వస్థతకు గురైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పశ్చిమ…
కరోనా తరువాత దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజ్ పున:ప్రారంభం అయినప్పట్టికీ కాలేజ్‌లో ఉన్న సమస్యలపై ప్రన్సిపాల్ సిబ్బంది దృష్టి పెట్టలేదని, ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కాలేజ్ సమస్యలపై అనేక సార్లు మెమొరాండం ఇచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టినందుకు ప్రిన్సిపాల్ బ్లాక్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కాలేజ్ ఆవరణలో ఎక్కడికక్కడ గడ్డి పేరుకుపోయి పాములు తిరుగుతున్నాయన్నారు. క్లాస్ రూంలో ఎలక్ట్రిసిటీ సమస్యలు, ఆట సామగ్రి, ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం వంటి అనేక సమస్యలు…