ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు భారీగా చేరారు. కానీ, ప్రభుత్వ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ కొరత తలనొప్పిగా మారింది. స్కూళ్ళల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్ధుల సంఖ్య బాగా ఎక్కువగా వుంది. కరోనా కారణంగా ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఎంతో మంది పేరెంట్స్,…
ఏపీ రాజధాని ఏది అంటే ప్రస్తుతం ఠక్కున చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ న్యాయపరమైన అంశాల దృష్ట్యా ఇటీవల మూడు రాజధానులను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో అస్పష్టత నెలకొంది. ఇది విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ ప్రతిబింబించింది. నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించిన ఇండియా…
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ స్పందించారు. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయని కమల్ ట్వీట్ చేశారు. అమాయక విద్యార్థుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలని… తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ తన…
సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో విద్యను బోధిస్తుంటారు. వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తుంటారు. అయితే, వారణాసిలోని హిందూ బనారస్ విశ్వవిద్యాలయంలో పిడకలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. సోషల్ సైన్స్ అండ్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశిల్ విద్యార్థులకు పిడకలు చేయడంపై శిక్షణ అందించారు. విశ్వవిద్యాలయంలోని సమీకృత గ్రామాభివృద్ది కేంద్రంలో విద్యార్థులకు శిక్షణ అందించారు. కేవలం వంట చేసుకోవడానికి మాత్రమే కాకుండా యజ్ఞయాగాదుల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ పిడకలను వినియోగిస్తారు. ఒకప్పుడు గ్రామాల్లో పిడకలను ప్రతి ఇంట్లో వినియోగించేవారు. కానీ, ఇప్పుడు కొన్ని…
ఉన్నత విద్యా వేదికలైన యూనివర్సిటీలను ఇంకా ర్యాగింగ్ బూతం వెంటాడుతూనే ఉంది.. వర్సిటీల్లో, కాలేజీల్లో, హాస్టళ్లలో ర్యాగింగ్ పై నిషేధాన్ని విధించినా కొన్ని చోట్ల ఇంకా ర్యాగింగ్ కొనసాగడం ఆందోళన కలిగించే విషయం.. తాజాగా, సోషల్ మీడియా వేదికగా జేఎన్టీయూ విజయనగరం క్యాంపస్ విద్యార్థి తన గోడు వెల్లబోసుకున్నారు.. Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లికి ఎంట్రీ..! నా పేరు శ్రీనివాస్.. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.…
ప్రేమ.. ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు.. ఇక ఈ ప్రేమలో పడినవారికి ఇద్దరు ఒకేచోట ఉండాలని, ఎక్కువ సమయం గడపాలని ఉంటుంది. ఇక ఈ కాలం ప్రేమ జంటలు అయితే ఎప్పుడు సమయం చిక్కిద్దా ..? ఏకాంతంగా గడుపుదామా అనే ఆలోచనలోనే ఉంటారు. దానికోసం ఏమైనా చేస్తారు. తాజాగా ఒక యువకుడు తన ప్రేయసితో ఏకాంతంగా గడపడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ, చివరికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..…
కోవిడ్ కేసులు పెరగడంతో స్కూళ్లకు సెలవులిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంతకీ కరోనా విజృంభిస్తే స్కూళ్లు మూసేయాలా? ప్రపంచ బ్యాంక్ విద్యారంగం డైరెక్టర్ జేమీ సావెద్రా దీనిపై పరిశోధన చేశారు. విద్యా వ్యవస్థపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా కారణంగా నెలలపాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఇప్పటికీ పలు దేశాల్లో విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరుకాలేకపోతున్నారు. అయితే, ఈ కారణంగా పాఠశాలలను మూసివేయడాన్ని ప్రపంచబ్యాంకు సమర్థించుకోలేమంటోంది. విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని మండిపడ్డారు. ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.. కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడగా.. తాజాగా మరో 15 మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 44కు చేరుకుంది. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లతో సహా 29 మంది మెడికోలకు నిన్న మధ్యాహ్నం వరకు…