నిన్న ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి. మొదటి సంవత్సరం పరీక్షల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. గతేడాది కంటే 11 శాతం తక్కువ పాస్ పర్సంటేజ్ ఉండటం విశేషం. లాక్ డౌన్ కారణంగా మార్చిలో ఇంటర్ పరీక్షలు నిర్వహించలేకపోయామని, పరీక్షల్లో సిలబస్‌ను తగ్గించామని, ప్రశ్నల్లో ఛాయిస్‌లు కూడా పెంచినట్టు ఇంటర్ బోర్డు తెలియజేసింది.
Read: అమరావతి మహాసభపై వైసీపీ కీలక వ్యాఖ్యలు…
మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, రిజల్ట్స్‌లో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, ప్రాసెస్ పర్ఫెక్ట్‌గా జరిగిందని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫలితాల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. విద్యార్థులు తమ పెర్ఫార్మెన్స్ తెలుసుకోవాలంటే రీ వాల్యుయేషన్ రీ ఔంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలియజేసింది.