కరోనా, ఒమిక్రాన్ మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. వీటి దెబ్బకు అన్ని వ్యాపారసముదాయాలు, విద్యాసంస్థలు ఇతర పనులు వాయిదా, లేదంటే మొత్తంగా మూత పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే కరోనా,ఒమిక్రాన్ దెబ్బ అన్నింటి కన్నా ఎక్కువగా విద్యాసంస్థలపై పడింది. ఎప్పుడు ఏమౌవుతుందోనని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. అయితే తాజాగా ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సీటీ పరిధిలో జరిగే అన్ని పరీక్షలను విశ్వ విద్యాలయం వాయిదా వేసింది. Read Also: బండి…
సూర్యాపేట వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనలో…ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహం నుంచి శాశ్వతంగా పంపించేశారు. సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఆరుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2019-20 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు జె.మహేందర్, జి.శశాంక్,…
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం బ్రహ్మపూరి గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పట్ల కులవివక్షత చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన విద్యార్థులకు ఒక పాఠశాల, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు మరో పాఠశాల ఏర్పాటు చేసి బోధన ..దీంతో కుల వివక్షతకు ఆజ్యం పోసిన మండల విద్యాశాఖ అధికారులు. గ్రామ పంచాయితీ సర్పంచ్ సూచనలు మేరకు విద్యార్థుల మధ్య కుల విభజన చేశారంటూ ఆరోపణలు…
కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకోని మాములు స్థితిలోకి వచ్చినా ..మళ్లీ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతునే ఉంది. అయినా ఏదో రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతునే ఉంది. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా తన పంజా విసురుతుంది. మరోవైపు ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ప్రజలను హెచ్చరిస్తునే ఉన్నాయి. తాజాగా..ఉత్తరఖండ్-నైనిటాల్ నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోరానాపాజిటివ్…
వీకెండ్ వచ్చిందంటే చాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. మందేసి చిందేసి రోడ్లమీదకి వచ్చి మరీ అమాయక జనం ప్రాణాలు తీసేస్తున్నారు.మొయినబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం బలయింది. మొయినబాద్ నుండి చేవెళ్ల వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రేమిక (16) ఘటన స్థలంలోనే మృతిచెందింది. ప్రస్తుతం సౌమ్య,అక్షర గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మరో 24 గంటలు గడిస్తే…
తెలంగాణలో ఇంటర్ ఫలితాలతో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 49 శాతం పాస్ కావడంతో విద్యార్థులు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే విద్యార్థి సంఘాలు జూనియర్ కాలేజీల బంద్‌ను సైతం నిర్వహించాయి. దీంతో ప్రతిరోజు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలకు దిగుతున్నారు. అటు జిల్లాల్లో సైతం ఇదేపరిస్థితి నెలకొంది. తరగతులు నిర్వహించకుండా పరీక్షలు పెట్టి తమను ఫెయిల్ చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ఇంటర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇంటర్ బోర్డు…
యూనివర్శిటీలో వుండే అనధికారిక విద్యార్ధినీ, విద్యార్ధులకు అల్టిమేటం ఇచ్చింది ఉస్మానియా వర్శిటీ. డిసెంబర్ 27న, అన్ని సెమిస్టర్ల ప్రారంభ తేదీ దగ్గర పడుతోంది, హాస్టళ్లలో ఉంటున్న అనధికార వ్యక్తులందరూ 24 డిసెంబర్ 2021 (శుక్రవారం) మధ్యాహ్నం 12.00 గంటలలోపు గదులను ఖాళీ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. హాస్టళ్లలో అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యాలను నియంత్రించడానికి అనధికార వ్యక్తులను హాస్టళ్ల నుండి ఖాళీ చేయాలని బోనఫైడ్ విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ చేయని వారిని…
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలకు సంబంధించి విద్యార్థులలో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జలీల్ తెలిపారు. అనుమానం ఉంటే…
తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ షాకిచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు… నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.…