ఏప్రిల్‌లోనే పరీక్షలు ..ఇంటర్‌బోర్టు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలకు సంబంధించి విద్యార్థులలో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జలీల్ తెలిపారు. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చని చెప్పారు.
Read Also :రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల బంద్ కి పిలుపు…
Also Read
పరీక్షల్లో సిలబస్ 70 శాతానికి తగ్గించి, ప్రశ్నల్లో ఛాయిస్ పెంచామని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. కరోనా నేపథ్యంలో నేరుగా తరగతులు జరగకపోవడం, ఆన్‌లైన్ తరగతులతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొనడం, మొదట్లో పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేయడం, మళ్లీ తిరిగి పరీక్షలను నిర్వహించిన నేపథ్యంలో విద్యార్థులు అయోమయానికి గురయ్యారని, హాజరు శాతం తగ్గడానికి అదే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో తాజాగా ఇంటర్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఊరటనిచ్చింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 11 శాతం ఉత్తీర్ణత తగ్గడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మొత్తం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!