మనదేశంలో గురువును దేవుడితో సమానంగా పూజిస్తారు. విద్యాబుద్దులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు గురువు బాటలు వేస్తారు. అలాంటి గురువులను ఇప్పుడు విద్యార్థులు హెళన చేస్తున్నారు. అవమానిస్తున్నారు. కర్ణాటకలోని దావణగెరే జిల్లాలోని చన్నగిరి టౌన్‌లో నల్లూర్ ప్రభుత్వ పాఠశాల ఉన్నది. ఆ పాఠశాలలోని తరగతి గదిలోకి వచ్చిన ఓ టీచర్‌కు క్లాస్‌రూమ్‌లో గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. విద్యార్థులు క్రమశిక్షణను పాటించాలని చెప్పాడు.
Read: సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణం దిశగా ఇండియా…
దీంతో ఆగ్రహించిన విద్యార్థులు టీచర్‌ను దారణంగా అవమానించారు. చెత్తబుట్టను టీచర్ తలపై బోర్లించి నానా హంగామా చేశారు. దీనిని సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం విద్యాశాఖ వరకు వెళ్లింది. దీనిపై విద్యాశాఖ మంత్రి స్పందించారు. టీచర్‌పై విద్యార్థులు దాడి చేయడం సహించరానిదని అన్నారు. దీనిపై సమగ్రదర్యాప్తుకు ఆయన ఆదేశించారు. అయితే, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పిల్లలపై ఫిర్యాదు చేయకూడదని టీచర్ నిర్ణయించుకున్నారు.