ఆరోగ్యమే మహాభాగ్యం. ఉదయపు నడక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అందుకే డాక్టర్లు ఉదయం వాకింగ్ చేయాలంటున్నారు. స్వంత రాష్ట్ర పర్యటనలో వున్న భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మార్నింగ్ వాక్ చేశారు. విజయవాడ పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు ఉదయపు నడకతో ఉత్సాహంగా కనిపించారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు. వారికి నడక ప్రాధాన్యతను వివరించారు. ఎంత బిజీగా వున్న ఉదయం నడక సాగించాలని వెంకయ్య వారికి సూచించారు. ఆయనే…
మనల్ని పాలించే నేతలు ఎలా వుండాలి? వారి ప్రవర్తన ఎలా వుండాలి? అనేదానిపై ప్రజలు ఆలోచించాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విజయవాడలో విద్యార్థులతో ముఖాముఖి లో వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులను ఎన్నుకునే ముందు కులం మతం చూసి ఎన్నుకోకూడదన్నారు. నేతల కులం కన్నా గుణం మిన్న అన్నారు వెంకయ్యనాయుడు. మంచి వారిని సేవా భావం ఉన్న వారిని ప్రోత్సహించాలి నాయకుడిగా ఎన్నుకోవాలి. పార్లమెంట్ కి అసెంబ్లీకి పోయి మాట్లాడేటప్పుడు సభ్యతతో సంస్కారంతో…
జగన్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే విద్యార్థుల కోసం అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలు తీసుకొచ్చి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటుంది. తాజాగా ఈ రెండు పథకాల డబ్బుకు బదులు ల్యాప్‌టాప్ కావాలని ఆప్షన్ ఇచ్చారు విద్యార్థులు. ఇలా ఆప్షన్లు ఇచ్చిన వారిలో 6.53 లక్షల మంది ఉన్నారు. తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బు కాకుండా ల్యాప్‌టాప్‌లు కావాలని కోరిన విద్యార్థులకు వీటిని…
కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. క్రమంగా అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, విద్యా సంస్థలు అన్ని ఓపెన్ చేశారు.. కానీ, ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్కడక్కడ కరోనా బారినపడడం కలవరానికి గురిచేస్తోంది.. మరో విషయం ఏటంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లో నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 550 మందికిపైగా విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారి వెల్లడించారు.. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సీటీ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.VIT,SRMకు గరిష్ఠంగా రూ.70 వేలు, సెంచూరియన్‌కు రూ.50వేలుగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. బకాయిలు బాగా పెరిగిపోవడంతో కాకినాడ JNTU పరిధిలోని కాలేజీల గుర్తింపును నిలిపివేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35 శాతానికి పైగా అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ సీట్లను కన్వీనర్ కోటాలనే భర్తీ చేస్తారు. ప్రభుత్వం ఫీజలు ఖరారు చేయకుంటే ప్రవేట్ వర్సీటీలు ఇష్టారీతిన విద్యార్థుల నుంచి అధిక ఫీజలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం…
కాకతీయ యూనివర్సీటీ పరిధిలో జరిగిన డిగ్రీ ఇన్స్టంట్ పరీక్షా ఫలితాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు కళాశాల ప్రన్సిపాల్ మనోహార్ వివరాలు తెలిపారు. బీఎస్సీ, బీకామ్, బీఏ, డిగ్రీ మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు తెలియజేశారు. విద్యార్థులు అధికారిక సైట్లో తమ ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. లేదా కాలేజీలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. హనుమంతు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం మళ్ళీ పరీక్షలకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది ఇంటర్ విద్య జే.ఏ.సి. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తూ, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే…
దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి యూపీఎస్సీ పరీక్షలు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులకు కరెంట్ సమస్యలు వంటివి తలెత్తకుండా ఉండాలి. అప్పుడు వారి విద్య సాఫీగా సాగుతుంది. బీహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆ రాష్ట్రం ఎన్నో రకాలుగా వెనబడి ఉన్నది. కానీ, ఇప్పుడు కొంతమేర అభివృద్ది చెందింది. కానీ, కొన్ని గ్రామాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. గ్రామాల్లో ఎప్పుడు…
చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ దోమల్ గూడలో జరిగింది. గగన్ మహల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కీచక టీచర్ ఉదంతం బయటపడింది. పిల్లల ఫోటోలు తీస్తూ బెదిరించాడు, తాను చెప్పినట్లు వినాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ కీచక టీచర్ శ్రీనివాస్ ప్రవర్తనతో విద్యార్థినులు స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నారు. తల్లిదండ్రులు విషయం తెలుసుకొని స్కూల్ లో టీచర్ ను నిలదీశారు. గత కొంతకాలంగా పిల్లలతో, తోటి…
నిన్నటి రోజున దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు జరిగాయి. దేశంలోని 202 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 లక్షల మంది ఈ పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది.…