డిగ్రీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆ కోర్సులు తమకు నచ్చకుంటే వేరే కోర్సుల్లో చేరేందుకు మూడు రోజుల గడువును ఇచ్చింది. తెలంగాణ రాష్ర్టంలో ఇప్పటికే దోస్త్ ద్వారా కాలేజీల్లో చేరిన డిగ్రీ విద్యార్థులు మూడోవిడత కింద కోర్సులను మార్చుకునేందుకు ఇంట్రా కాలేజీ స్లైడింగ్‌కు ఉన్నత విద్యామండలి అవకాశం ఇచ్చింది.
Also read: పీహెచ్‌డీలో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్
దీన్లో భాగంగా ఈ నెల15 నుంచి 17 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్‌లు ఇచ్చుకుకోవాలని సూచించింది. వారు ఎంచుకున్న కోర్సుల్లో 18న సీట్లను కేటాయించనున్నట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఈసారి డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమైన కాలేజీలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. కాలేజీల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఆయా కాలేజీలు తరగతులను కొనసాగించేందుకు సన్నద్ధం అవుతున్నాయి.