2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా తలపడనుంది. ఈసారి ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిస్తున్నాయి.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. టీ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన టీమిండియా చివరి సెషన్లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ పరిస్థితిని మార్చేశారు.
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. 55 పరుగులతో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేశారు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి సెషన్లోనే ఆలౌట్ కావడం గమనార్హం. సెంచూరియన్‌లో లొంగిపోయిన భారత జట్టు కేప్‌టౌన్ టెస్టులో అద్భుతంగా పునరాగమనం చేసింది.
జూన్‌లో వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందులో టీమిండియాకు పెద్ద ముప్పుగా మారే జట్టును భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. 2024 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల కంటే అఫ్గానిస్థాన్ నుంచి టీమిండియాకే ఎక్కువ ముప్పు పొంచి ఉందని అన్నాడు. కాగా.. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ గెలవడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా టైటిల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోందని, అందుకే టీ20…
నేడు తూర్పుగోదావరి జిల్లాలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొవ్వూరు క్యాంప్ ఆఫీసులో హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం కొవ్వూరులో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు హైదరాబాదులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరు రూరల్ పరిధిలోని గుడపల్లిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు…
నేడు వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సోనియా, కాంగ్రెస్ పరువుకు భంగం కలిగించేలా సినిమాను చిత్రీకరించాలని పిటిషనర్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించాలని కోరారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించనున్నారు. ‘విద్యా దీవెన’కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి నేడు మలివిడత సీఎం జగన్‌తో…
నేడు కృష్ణా జిల్లాలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించనున్నారు. పామర్రు బెల్ పరిశ్రమ పరిశీలన, జిల్లా కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొననున్నారు. నేడు అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాంను విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించనున్నారు. అనంతరం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కొవ్వూరు టౌన్లో…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా దేశంలో క్రీడా కార్యకలాపాలకు అద్భుతమైన వాతావరణం ఏర్పడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయంగా క్రీడా రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు.
కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 డిసెంబరు 2న ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని ట్రాన్స్‌స్టేడియాలోని ఏకా అరేనా గ్రౌండ్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ మ్యాచ్ లు 2024 ఫిబ్రవరి 21 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. ప్లే ఆఫ్లకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే తెలపనున్నారు. మరోవైపు పో కబడ్డీ సీజన్ 10 కోసం తెలుగు టైటాన్స్ కొత్త జట్టును ప్రకటించింది.
భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఖతార్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 0-3 తేడాతో ఓడిపోయింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత ఫుట్‌బాల్ జట్టు.. అంతకుముందు కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది.