దాదాపు రెండు నెలల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2024తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టుతో కలిసి.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రతి ఐపీఎల్ కు ఎవరో ఒక ఆటగాడు వినూత్నమైన స్టైల్ లో ఆకట్టుకోవడం మన చూశాం. తాజాగా.. కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్ లో ఆకట్టుకోవడానికి కొత్త లుక్ లో వస్తున్నాడు.
Read Also: Supreme Court: CAAపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ.. 3 వారాల్లో స్పందించాలని కేంద్రానికి ఆదేశం..
కోహ్లీ గురించి చెప్పాలంటే.. అతను ఎప్పటికప్పుడు సరికొత్త హెయిర్స్టైల్తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటాడు. తాజాగా.. ఇప్పుడు మరో కొత్త హెయిర్స్టైల్లో కనిపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అవుతున్నాయి. అయితే అతనికి హెయిర్ స్టై్ల్ చేసింది.. సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్. ఇతను ఇండియాలో ఉండే టాప్ సెలబ్రీలకు మాత్రమే హెయిర్ స్టైలింగ్ చేస్తాడు. గత ఐపీఎల్ లో కూడా విరాట్ కోహ్లీ కొత్త స్టైల్ లో కనిపించాడు.. అప్పుడు కూడా హెయిర్ స్టైలింగ్ చేసింది అలీమ్ హకీమే.
Read Also: Bullet Train: 2026 నాటికి అందుబాటులోకి బుల్లెట్ రైలు: అశ్వినీ వైష్ణవ్
ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది. మార్చి 22న ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా.. ఐపీఎల్ ఆరంభానికి ముందు ఆర్సీబీ ఆన్‌బాక్స్ ఈవెంట్‌ను నిర్వహించనుది. మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ లో విరాట్ కోహ్లీ సందడి చేయనున్నాడు.
𝑽𝒊𝒓𝒂𝒕 𝑲𝒐𝒉𝒍𝒊 gets a new look 💇
📸: Aalim Hakim pic.twitter.com/QbClloVr80
— CricTracker (@Cricketracker) March 19, 2024