రాజస్థాన్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ(40) మృతి చెందారు. గత కొంతకాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్న రోహిత్ శర్మ.. జైపూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు.
సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు. అతనికి చరిత్ర పుటల్లో ప్రత్యేక పేరుంది. తన ఆటతో అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. సచిన్ ను ఇండియాలో క్రికెట్ దేవుడిగా పిలుస్తారు. కాగా.. క్రికెట్ కు సచిన్ చేసిన సేవలకు భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. ఇదిలా ఉంటే.. తన బ్యాట్ తో మొదటిసారి చరిత్ర సృష్టించిన రోజు ఈరోజు.. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఫిబ్రవరి 24న క్రికెట్ చరిత్రలో…
పండంటి రెండో బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కొడుకుకు 'అకాయ్' అని నామకరణం చేశారు. అయితే ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశించే చంద్రుడని అర్థం. ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది. ఇక మొదటి కుమార్తెకు 'వామిక' అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి మరోపేరు వామిక. అలాగే విరాట్-అనుష్క పేర్లు కలిసేలా ఈ పేరు ఉంది.
క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ ఇండియాలో ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. భారత్ లోనే ఐపీఎల్ 2024 నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా.. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయని ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
ఈ ఏడాది వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న టీ-20 ప్రపంచకప్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టీ-20 ప్రపంచకప్లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆడుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం తెలిపారు.
ఆదివారం అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ భారత్-ఆస్ట్రేలియా మధ్య దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పొందింది. అయితే ఈ మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు తెలుగులో మాట్లాడే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సౌతాఫ్రికాలో జరిగిన ఎస్ఏ టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. నిన్న కేప్ టౌన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగుల భారీ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్లో జోర్డాన్ హెర్మన్ 42, అబెల్ 55,…
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో తలపడుతున్న టీమిండియా రెండో టెస్టు రెండు రోజు ఆధిక్యంలో నిలిచింది. భారత్ను మొదటి సెషన్లోనే ఆలౌట్ చేసి ఆ తర్వాత విజృంభించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకే ఆలౌటయ్యారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు ఆరు వికెట్ల (6/45)ను సమర్పించుకున్నారు. ఇదే కోవలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు (3/71) తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో.. 253 రన్స్కే ఇంగ్లండ్ ఆలౌట్ అవడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్కు…
విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ 336/6తో రెండోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 396 పరుగులకు మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది.
విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. రేపటి నుండి 5 రోజుల పాటు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. రెండు రోజులపాటు ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగిపోయాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపు ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుండి స్టేడియంలోకి వీక్షకులను సిబ్బంది అనుమతించనున్నారు.