న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ గెలిచి ఆస్ట్రేలియా జట్టు మంచి ఊపు మీదుంది. ఆ తర్వాత.. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. కాగా.. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్.. ఆగష్ట్ లో షెడ్యూల్ అయింది. అయితే.. ఆ సిరీస్ ను వాయిదా వేస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. అయితే ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం రాగానే మహిళల క్రికెట్ జట్టుపై అక్కడి ప్రభుత్వం బ్యాన్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం.. మహిళల శరీర అవయాలు బట్టలు వేసుకోవడం, మగాళ్ల ముందు ఆటల ఆడటం లాంటివి అక్కడ నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం ఉమెన్స్ క్రికెట్ జట్టును రద్దు చేసింది.
IPL 2024: ముంబై ఇండియన్స్ టీమ్కు హార్ట్ బ్రేక్ న్యూస్.. స్కై పోస్ట్ వైరల్..!
దీంతో రెండేళ్ల క్రితం ఆఫ్ఘాన్ తో జరగాల్సిన వన్డే, టెస్ట్ సిరీస్ ను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా రద్దు చేసింది. తాజాగా టీ20 సిరీస్ ను క్యాన్సిల్ చేసింది. ఇదిలా ఉంటే.. ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు, అమ్మాయిలు స్వేచ్ఛగా క్రీడల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని.. అందుకోసం ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు సాగిస్తామని తెలిపింది ఆస్ట్రేలియా క్రికెట్. ఆఫ్ఘాన్ లో ఆడవాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. ఈ కారణంవల్ల ఆఫ్ఘాన్ తో ద్వైపాక్షిక సిరీస్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Intermittent Fasting: అడపదడపా ఉపవాసంతో జాగ్రత్త.. గుండెపోటు వచ్చే అవకాశం..!
క్రికెట్ ఆస్ట్రేలియా మహిళలకు, అమ్మాయిలకు మంచి స్వే్చ్ఛనిస్తుంది. క్రికెట్ లో రాణించేందుకు తమ వంత సహాయం చేస్తుంది. అటు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా స్త్రీ, పురుషుల క్రికెట్ ను ఒకేలా చూస్తోంది. అయితే.. ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు.. మహిళా టీమ్ పై తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అంటుంది. ఆఫ్ఘాన్ లో అమ్మాయిలకు స్వేచ్ఛ, సాతంత్ర్యం ఇస్తేనే.. వారితో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతామని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతుంది. ఇదిలా ఉంటే.. గతేడాది జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లోనూ, వన్డే వరల్డ్ కప్ 2023లోనూ ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే..