ఓ టోర్నమెంట్లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్ముఖ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తన ఆట కన్నా తన అందం, జుట్టు, బట్టలు, మాటతీరు వంటి అనవసర విషయాలపై దృష్టి సారించారని వాపోయారు.
పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్కు కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇటాలియన్ యువ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడు. ఈరోజు జరిగిన టైటిల్ మ్యాచ్లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్ను ఐదు సెట్లలో ఓడించాడు. ఈ మ్యాచ్లో సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ ఫైనల్ గెలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్గా సిన్నర్ నిలిచాడు.
2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కాగా.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యకుమార్ తో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
ముత్యాల ముగ్గులు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 12వ సార్వత్రిక ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలను భారత్కు చెందిన ముగ్గురు సహా 100 మందికి పైగా విదేశీ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు. ఈ ఎన్నికల్లో 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ పోటీ చేస్తుండగా.. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. నేడు తిరువూరు, అచంటలో టీడీపీ ‘రా కదిలిరా’ బహిరంగ…