Saeed Ahmed: పాక్ మాజీ కెప్టెన్ కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు. అందులో 5 సెంచరీలు, 16 అర్ధ శతకాలతో 2991 పరుగులు చేశారు. అంతేకాకుండా.. అహ్మద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా.. 22 వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే.. అహ్మద్ చేసిన 5 శతకాలలో మూడు ఇండియాపైనే నమోదు చేశారు.
IPL: ముగిసిన ఒక శకం.. వీరి కెప్టెన్సీ ఇక చూడలేమా..!
Also Read
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
1958లో వెస్టిండీస్‌తో జరిగిన బ్రిడ్జ్‌టౌన్ టెస్ట్‌లో అహ్మద్ అరంగేట్రం చేశాడు. 1972-73లో మెల్‌బోర్న్ వేదికగా తన చివరి టెస్టు మ్యాచ్ ఆడారు. అహ్మద్ పాకిస్థాన్‌కు ఆరో టెస్టు కెప్టెన్. పాక్ దిగ్గజం హనీఫ్ మహ్మద్ తర్వాత కెప్టె్న్సీ బాధ్యతలు 1969లో అహ్మద్ కే దక్కాయి. . తన స్వల్ప కెరీర్‌లో మూడు మ్యాచ్‌ల్లో పాక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Manchu Manoj: పవన్ కే ఓటు వేయండి.. నేను అలా అనలేదు
ఫిట్‌నెస్ విషయంలో క్రికెట్ బోర్డుకు తప్పుడు సమాచారం అందించాడన్న కారణంగా అతని కెరీర్‌కు అర్దంతంగా ఎండ్ కార్డ్ పడింది. పాక్ దిగ్గజం హనీఫ్ ముహమ్మద్ విండీస్‌పై చారిత్రక ట్రిపుల్ సెంచరీ (337) సాధించిన ఇన్నింగ్స్‌లో అహ్మద్ అతని భాగస్వామిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. సయీద్ అహ్మద్ సోదరుడు యూనుస్ అహ్మద్ కూడా పాక్ టెస్ట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. యూనుస్ పాక్ తరఫున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. కాగా.. అహ్మద్ మృతిపట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ సంతాపం తెలిపారు. సయీద్ అహ్మద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!