IPL 2024: ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్‌న్యూస్ వచ్చింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన యంగ్ పేసర్ మతీశా పతిరణ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని పతిరణ మేనేజర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అయితే పతిరణకు లంక బోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే అతడు సీఎస్కే జట్టులో చేరనున్నాడు. దీంతో ఒకట్రెండు మ్యాచ్‌లకు పతిరణ దూరమయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2024 మహా సంగ్రామం నేటి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తోందనని క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో ధోని ఎలా బ్యాటింగ్ చేస్తారో, హెలికాప్టర్ షాట్ల గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా సీఎస్కే హాట్ ఫేవరేట్‌గా నేడు బరిలోకి దిగనుంది.