ఆదివారం అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ భారత్-ఆస్ట్రేలియా మధ్య దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పొందింది. అయితే ఈ మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు తెలుగులో మాట్లాడే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సౌతాఫ్రికాలో జరిగిన ఎస్ఏ టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. నిన్న కేప్ టౌన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగుల భారీ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్‌లో జోర్డాన్ హెర్మన్ 42, అబెల్ 55,…
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో తలపడుతున్న టీమిండియా రెండో టెస్టు రెండు రోజు ఆధిక్యంలో నిలిచింది. భారత్‌ను మొదటి సెషన్లోనే ఆలౌట్ చేసి ఆ తర్వాత విజృంభించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే ఆలౌటయ్యారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు ఆరు వికెట్ల (6/45)ను సమర్పించుకున్నారు. ఇదే కోవలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు (3/71) తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో.. 253 రన్స్‌కే ఇంగ్లండ్ ఆలౌట్ అవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు…
విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ 336/6తో రెండోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 396 పరుగులకు మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది.
విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. రేపటి నుండి 5 రోజుల పాటు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. రెండు రోజులపాటు ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపు ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుండి స్టేడియంలోకి వీక్షకులను సిబ్బంది అనుమతించనున్నారు.
ఓ టోర్నమెంట్లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తన ఆట కన్నా తన అందం, జుట్టు, బట్టలు, మాటతీరు వంటి అనవసర విషయాలపై దృష్టి సారించారని వాపోయారు.
పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇటాలియన్ యువ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడు. ఈరోజు జరిగిన టైటిల్ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్‌ను ఐదు సెట్లలో ఓడించాడు. ఈ మ్యాచ్‌లో సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ గెలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.
2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యకుమార్ తో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.