బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ తరచుగా తన ప్రత్యేకమైన, స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈసారి దీపావళి సందర్భంగా, సోనమ్ తన సాంప్రదాయ అవతారంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అందమైన చిత్రాలను పంచుకుంది.
యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ ఐపీఎల్ మ్యాచ్ లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో కలిసి మ్యాచ్ చూశాడు. టీమ్ కుక్ తో పాటు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు.
Arjun Kapoor: బాలీవుడ్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టాప్ సెలబ్రిటీల సీక్రెట్స్ ను బట్టబయలు చేయడానికి బడా నిర్మాత కరణ్ జోహార్ పనిగట్టుకొని ఈ షోను నడిపిస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అనిల్ కపూర్ ముద్దుల కూతురు సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన ఈ చోరీ.. ఈ నెలలో బయటికి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక కేసును ప్రెస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు. కోట్లల్లో నగలు, డబ్బులు ఎత్తుకెళ్లింది వేరే ఎవరో కాదని.. ఆ ఇంట్లో పనిచేసే నర్సే అని పోలీసులు తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సోనమ్ కపూర్, ఆమె…
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్ల విలువైన నగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 23 న ఈ ఘటన జరగగా హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సోనమ్ ఇంట్లో పనిచేసేవారి ద్వారా ఈ విషయం బయటపడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఒక ఖరీదైన ప్లాట్ లో సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా, అతని తల్లితండ్రులుతో…
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గత నెలలో భర్త ఆనంద్ అహుజాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో తల్లి కాబోతున్న సోనమ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇక తాజాగా సోనమ్ బేబీ బంప్ తో చేసిన ఫోటోషూట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలలో ఆమె తెల్లని దుస్తులు ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. రెట్రో…
Sonam Kapoor తల్లికాబోతోంది. ఈ విషయానికి సంబంధించి ఆమె పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 2020లో ‘AK vs AK’లో చివరిగా కనిపించిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ అహుజా ఇప్పుడు గర్భవతి. సోనమ్ కేవలం నటి మాత్రమే కాదు ఫ్యాషన్ దివా, ఇంటీరియర్ డిజైనర్ కూడా. తాజాగా ఈ బ్యూటీ తన భర్త, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో ఉన్న సన్నిహిత చిత్రాలను పంచుకున్నారు. తన బేబీ బంప్ చిత్రాలను…
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు యుద్ధంలో దెబ్బతిన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులందరూ విడుదలయ్యారు. ఇంతకుముందు సుమీలో చిక్కుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు తమ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో భారతీయ విద్యార్థుల పట్ల జాతి వివక్ష చూపిస్తున్నారని, స్థానిక దుకాణాలలో జాత్యహంకారాన్ని కూడా ఎదుర్కొన్నామని ఓ విద్యార్థి తెలిపాడు. ఈ విషయంపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని…
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన స్టైల్ తో బాలీవుడ్ లో బ్యూటీ ఐకాన్ గా నిలవడమే కాదు… తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. దానిపై ఎన్ని ట్రోల్స్ ఎదురైనా ఆమె వెనక్కి మాత్రం తగ్గదు. తాజాగా అజ్ఞాని… అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేసింది సోనమ్ కపూర్. రీసెంట్ గా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర…