Arjun Kapoor: బాలీవుడ్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టాప్ సెలబ్రిటీల సీక్రెట్స్ ను బట్టబయలు చేయడానికి బడా నిర్మాత కరణ్ జోహార్ పనిగట్టుకొని ఈ షోను నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో ఇటీవలే ఏడవ సీజన్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ షో లో విజయ్ దేవరకొండ, సమంత ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. ఇక తాజా ఎపిసోడ్ బాలీవుడ్ స్టార్ కిడ్స్ సందడి చేశారు. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్,బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ అక్క తమ్ముళ్లు ప్రస్తుతం వారి వారి కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో ఉన్నారు. ఇక ఈ షో లో ఈ అక్కాతమ్ముళ్లను కూడా కరణ్ వదలలేదు. అవే బోల్డ్ ప్రశ్నలతో ఇద్దరినీ చిరాకు పెట్టాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. సోనమ్ ఈ షోకు నిండు గర్బంతోనే అటెండ్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం విదితమే.. ఇక ఈ ప్రోమోలో కరణ్ అక్కాతమ్ముళ్లిద్దరిని ఒక ఆట ఆడుకున్నాడు.
మీకు తెలిసి మీ తమ్ముడు మీ ఫ్రెండ్స్ ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్నాడు అంటూ సోనమ్ ను అడిగేశాడు కరణ్. దీనికి ఆమె మొహమాటం లేకుండా ఇప్పుడు చెప్పడం కష్టం.. కానీ నాకు అలాంటి బ్రదర్స్ లేరని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సమాధానానికి బిగ్గరగా నవ్విన కరణ్ అలాంటి బ్రదర్స్ లేరు అంటే ఎలాంటి బ్రదర్స్ మీకు ఉన్నారు అని అడిగాడు. ఇక దీనికి అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. ఈ షోకు నన్ను ఎందుకు పిలిచారు. మా అక్క చేత నన్ను ట్రోల్ చేయించడానికా..? సోనమ్.. మీ తమ్ముడు గురించి నువ్వు చెప్పే మాటలు ఇవేనా అంటూ బుంగమూతి పెట్టాడు. ఇక తర్వాత మలైకా పేరును అర్జున్ ఎలా సేవ్ చేసుకున్నావ్ అని అడుగగా.. నాకు మలైకా పేరు అంటే ఇష్టం .. అందుకే అలాగే సేవ్ చేసుకున్నాను అంటూ బదులిచ్చాడు. రసవత్తరంగా సాగిన ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంత ఘోరంగా తమ్ముడి గురించి ఒక అక్క ఏ విధంగా సమాధానం చెప్పగలదు.. కరణ్ ఇంత పచ్చిగా అడుగుతున్నావు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉండబోతుందో చూడాలి అంటున్నారు అభిమానులు.