Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి
- ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభాలు
- గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- వంటింటి గుట్టు వెల్లడించిన నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభాలు నెలకొన్నాయి. ఆయా దేశాల్లో గ్యాస్ సంక్షోభం తీవ్రంగా ఉంది. భారత్ మాత్రం ప్రస్తుతం సేఫ్ జోన్‌లో ఉంది. ఇప్పటి వరకైతే ఎలాంటి ఇబ్బందులు కనబడలేదు. కానీ సోషల్ మీడియా పుకార్లు కారణంగా అవసరం ఉన్నా.. లేకున్నా గ్యాస్ బండ్లను భద్రత చేసుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర పెద్ద ఎత్తున గృహ వినియోగదారులు క్యూలు కడుతున్నారు.
ఇలాంటి తరుణంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంటింటి గుట్టును బయటపెట్టారు. గ్యాస్ సంక్షోభం వేళ తన భార్య ట్వింకిల్ ఖన్నా ముందు జాగ్రత్తగా రెండు ఎలక్ట్రిక్ స్టవ్‌లను ఆర్డర్ చేసిందని తెలిపారు. ఆ రెండు స్టవ్‌లు ఇంకా ఇంటికి చేరాయో లేదో కూడా తనకు తెలియదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉంటే దేశంలో గ్యాస్ సంక్షోభం లేదని కేంద్రం తెలిపింది. పెట్రోలియం అండ్ సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉందని హామీ ఇచ్చారు. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందక్కర్లేదని భరోసా ఇచ్చారు. ‘‘సహజ వాయువు విషయానికి వస్తే నేను మీకు చెప్పినట్లుగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులందరూ పీఎన్‌జీకి మారితే ప్రయోజనకరంగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఎల్పీజీ, పెట్రోలియం సరఫరాలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత చమురు ట్యాంకర్ ‘‘జగ్ లాడ్కి’’ ఫుజైరా నుంచి భారతదేశానికి ముడి చమురును తీసుకువస్తూ సురక్షితంగా బయలుదేరిందని వెల్లడించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ నిరంతరాయంగా లభించేలా తగిన చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు.
ఇక ఎల్పీజీ సిలిండర్ల కోసం భయాందోళనలతో బుకింగ్ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దేశంలో ఎక్కడా కూడా ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల దగ్గర సరఫరా నిలిచిపోయినట్లుగా నివేదికలు రాలేదని పేర్కొంది. అయినప్పటికీ అధిక సంఖ్యలో కాల్స్ రావడం వల్ల కొన్ని గ్యాస్ డిపోల దగ్గర వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడి.. పొడవైన క్యూలు ఏర్పడినట్లుగా అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Trump-Cuba: క్యూబాలో అలుముకున్న అంధకారం.. ఏం జరుగుతోంది!?
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!