US: అమెరికాలో షాకింగ్ ఘటన.. ట్రంప్ ఉన్నతాధికారి రాజీనామా.. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు
- ట్రంప్ ప్రభుత్వంలో తిరుగుబాటు
- ట్రంప్ ఉన్నతాధికారి రాజీనామా
- ఇరాన్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌తో యుద్ధం వేళ ట్రంప్ ప్రభుత్వంలో తిరుగుబాటు మొదలైంది. ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక అధిపతి జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో సంచలన విషయాలు వెల్లడించారు. తన మనస్సాక్షికి విరుద్ధంగా ఇరాన్‌తో యుద్ధానికి మద్దతు ఇవ్వలేనని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు ఉండబోదని పేర్కొన్నారు.

Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
పశ్చిమాసియా యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి, దేశ సంపదను హరించివేస్తాయనే విషయం ట్రంప్‌కు 2025 జూన్ వరకు తెలుసని తన లేఖలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావవంతమైన సభ్యులు. ఒక తప్పుడు సమాచారం ద్వారా ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రోత్సహించారని తెలిపారు. ట్రంప్‌పై ‘‘ఎకో ఛాంబర్’’ను ఉపయోగించారని కెంట్ ఆరోపించారు. ఇరాన్‌తో యుద్ధం ముగించుకుంటే మంచిదని.. లేదంటే దేశాన్ని మరింత గందరగోళంలోకి నెట్టగలరని అభిప్రాయపడ్డారు.
‘‘ఇరాన్‌లో మనం ఏమి చేస్తున్నామో.. ఎవరి కోసం చేస్తున్నామో మీరు పునరాలోచించాలని నేను ప్రార్థిస్తున్నాను. సాహసోపేతమైన చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. మీరు మీ గమనాన్ని మార్చుకుని, మన దేశానికి ఒక కొత్త మార్గాన్ని నిర్దేశించవచ్చు. లేదా మమ్మల్ని మరింత పతనం.. గందరగోళం వైపు జారేలా చేయవచ్చు. అధికారం మీ చేతుల్లోనే ఉంది.’’ అని ట్రంప్‌ను ఉద్దేశించి కెంట్ రాశారు. ఇరాన్ యుద్ధం కారణంగా రాజీనామా చేసిన ట్రంప్ ప్రభుత్వంలోని మొదటి ప్రధాన అధికారి జోసెఫ్ కెంట్ కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!