JC Prabhakar Reddy Emotional: కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy Emotional: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కదిలించింది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి అభివృద్ధిపై తనకు స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. “2027 నాటికి ప్రపంచ పటంలో తాడిపత్రి పేరు కనిపించేలా అభివృద్ధి చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
త్వరలో నిర్మాణం పూర్తి కానున్న షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత పొందుతుందని తెలిపారు జేసీ.. ఆ ప్రాంతం భవిష్యత్తులో “బెంజి సర్కిల్” కాదని, “తాడిపత్రి సర్కిల్”గా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అనంతపురం నుంచి తాడిపత్రికి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలతో మాట్లాడిన ఆయన, తాను తప్పు చేస్తే చెప్పాలని, తప్పులను సరిదిద్దుకుంటామని అన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను కౌన్సిలర్లుగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. “డబ్బులు కావాలంటే మీకు నచ్చిన వారిని గెలిపించండి. అభివృద్ధి కావాలంటే పనిచేసే వారిని గెలిపించండి. దౌర్జన్యాలు, కబ్జాలు కావాలంటే మీకు నచ్చిన వారిని గెలిపించండి. అభివృద్ధి కావాలంటే జేసీ కుటుంబం నిలబెట్టిన వారిని గెలిపించండి” అని ఆయన వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడిన ఈ ప్రసంగం ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు