Sonam Kapoor: థియేటర్‌లో ఓ వ్యక్తి అక్కడ చేతులు వేశాడు.. భయంతో ఏడ్చేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Kapoor Revealed Being Molested In Movie Theatre: సినీ పరిశ్రమలో హీరోయిన్లకు, ఇతర భామలకు ఏదో ఒక సమయంలో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. చివరికి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లు కూడా వేధింపులకు గురైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా అలాంటి సందర్భాన్ని రివీల్ చేసి, అందరినీ షాక్‌కు గురి చేసింది. తన స్నేహితులతో కలిసి తాను థియేటర్‌కి వెళ్లినప్పుడు, ఓ వ్యక్తి వెనక నుంచి తన బ్రెస్ట్‌ని టచ్ చేశాడని కుండబద్దలు కొట్టింది. ఆ ఘటనతో తాను భయపడిపోయానని, ఏం చేయాలో తెలీక ఏడుస్తూ కుర్చున్నానని చెప్పింది. ఓ ఇంటరాక్షన్‌లో భాగంగా సోనమ్ ఈ షాకింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది.
Student Suicide: కృష్ణా జిల్లాలో యువతి ఆత్మహత్య.. ఫోన్ చెక్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
Also Read
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
- Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
సోనమ్ కపూర్ మాట్లాడుతూ.. ‘‘అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. ఓ సినిమా చూసేందుకు నేను నా స్నేహితులతో కలిసి ఒక థియేటర్‌కి వెళ్లా. ఇంటర్వెల్ తర్వాత స్నాక్స్ తీసుకోవడం కోసం బయటకు వచ్చా. అప్పుడు ఓ వ్యక్తి వెనక నుంచి వచ్చి, నా బ్రెస్ట్‌ని టచ్ చేశాడు. ఊహించని ఆ సంఘటనతో నేను ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందో నాకర్థం కాలేదు. ఆ షాక్‍తో అక్కడే కూర్చుని ఏడ్చేశా’’ అని తెలిపింది. అయితే.. ఈ సంఘటన గురించి తాను ఎక్కడా నోరు విప్పలేదని చెప్పింది. ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. ఇలాంటి సంఘటనలు, లైంగిక వేధింపుల గురించి మహిళలు నోరు విప్పాల్సిన అవసరం ఉందని ఆమె సూచించింది.
Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ
ఇదిలావుండగా.. ఒక స్టార్ వారసురాలిని అయినప్పటికీ, తాను ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కున్నానంటూ వరలక్ష్మి శరత్‌కుమార్ గతంలో బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. కొంతమంది దర్శకులు, నిర్మాతలు తన పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడేవారని.. తాను కాస్టింగ్ కౌచ్‌కు లొంగనని పలువురు ప్రముఖులకు చెప్పిన ఆడియో ప్రూఫ్‌లు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. తాను కాస్టింగ్ కౌచ్‌కు నేను నో చెప్పినందుకు.. కొందరు తనపై నిషేధం కూడా విధించారని పేర్కొంది. అయితే.. ఆ సవాళ్లను ఎదుర్కొని తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ల సంగతేంటో?
తాజావార్తలు
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!