యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ ఐపీఎల్ మ్యాచ్ లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో కలిసి మ్యాచ్ చూశాడు. టీమ్ కుక్ తో పాటు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు. యాపిల్ స్టోర్ల ప్రారంభం కోసం ఇండియాకు వచ్చిన కుక్.. ముంబయిలో తొలి స్టోర్ ను మంగళవారం ప్రారంభించారు. ఢిల్లీలో గురువారం రెండో స్టోర్ ను ప్రారంభించారు. ఆయన చివరిసారి 2016లో భారత్ లో పర్యటించారు. అప్పుడు కూడా ఐపీఎల్ మ్యాచ్ కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : Video Viral : బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. భయంతో జనం పరుగోపరుగు
ఏడు సంవత్సరాల తర్వత మళ్లీ భారత్ కు వచ్చిన టీమ్ కుక్ మరోసారి ఐపీఎల్ మ్యాచ్ చూశాడు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీని సైతం టీమ్ కుక్ కలిశాడు. దేశంలో మరిన్ని కంపెనీలు పెట్టేందుకు యాపిల్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్ లో సాంకేతిక మార్పుల గురించి ప్రస్తావించారు. ఈ వృద్దిలో సహాయపడేందుకు యాపిల్ సంసిద్ధంగా ఉందని టీమ్ కుక్ స్పష్టం చేశారు.
Also Read : Degrees Courses : కొత్త డిగ్రీ కోర్సులకు నాలుగేళ్ల కాలవ్యవధి..?
యాపిక్ స్టోర్ల ఓపెనింగ్ కు వచ్చిన ఆ సంస్థ సీఈఓ టీమ్ కుక్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సందడి చేశాడు. గురువారం ఢిల్లీలో సెకండ్ యాపిల్ స్టోర్ ను ప్రారంభించిన ఆయన రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూశారు. టీమ్ కుక్ తో పాటు బాలీవుడ్ నటీ సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజాతో కలిసి అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ వీక్షించారు. టీమ్ కుక్ చప్పట్లు కొడుతూ ఇరుజట్లను ఉత్సహపరిచాడు.