PM Vidya Lakshmi: పీఎం-విద్యా లక్ష్మి యోజన అంటే ఏమిటి? హామీ లేకుండా రూ. 10 లక్షల రుణం ఎలా పొందాలి?
- ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి యోజన
- రుణం మొత్తం రూ.10 లక్షల వరకు
- ట్యూషన్ ఫీజు, హాస్టల్, బుక్స్, ల్యాప్‌టాప్, లివింగ్ ఖర్చులు అన్నీ కవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి యోజన (Pradhan Mantri Vidyalaxmi Scheme) భారత కేంద్ర ప్రభుత్వం (ఉన్నత విద్యా శాఖ) 2024 నవంబర్ 6న ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల ఉన్నత విద్యను కోల్పోకుండా సహాయం చేస్తుంది. పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే , ఈ పోర్టల్ ద్వారా 3.31 లక్షలకు పైగా విద్యా రుణ దరఖాస్తులు ఆమోదం పొందగా, వాటిలో రూ. 7,229.4 కోట్లు పంపిణీ చేయబడ్డాయి.
విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, మొదటి సంవత్సరంలో ఫిబ్రవరి 24 వరకు అందిన 6,51,974 దరఖాస్తులలో 3,31,089 దరఖాస్తులు ఆమోదం పొందాయి. ఈ పథకం NEP 2020కు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఏటా 22 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందవచ్చు. రుణం మొత్తం రూ.10 లక్షల వరకు (అవసరమైతే ఎక్కువ కూడా, కానీ సబ్సిడీ రూ.10 లక్షల వరకే). ట్యూషన్ ఫీజు, హాస్టల్, బుక్స్, ల్యాప్‌టాప్, లివింగ్ ఖర్చులు అన్నీ కవర్ అవుతాయి. మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్లు, విదేశీ ఇన్‌స్టిట్యూషన్లు ఎలిజిబుల్ కావు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
పీఎం-విద్యా లక్ష్మి యోజన అంటే ఏమిటి?
ప్రధానమంత్రి-విద్యా లక్ష్మి యోజన, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) కింద ర్యాంక్ పొందిన నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో (QHEIs) మెరిట్ ఆధారంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు హామీదారులు లేకుండా రుణాలను అందిస్తుంది. ఈ పథకం కింద, రూ.8 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులు రూ.10 లక్షల వరకు రుణాలపై 3% వడ్డీ రాయితీకి కూడా అర్హులు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకం, దేశంలోని 860 అగ్రశ్రేణి విద్యాసంస్థలలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా రుణ సహాయాన్ని అందిస్తుంది. రూ.3,600 కోట్ల బడ్జెట్‌తో (2024–2031), ఈ పథకం ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ పథకం పారదర్శకమైన, వేగవంతమైన ప్రక్రియకు హామీ ఇస్తుంది.
వడ్డీపై రాయితీ
ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన కింద, వార్షిక కుటుంబ ఆదాయం రూ. 4.5 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు పూర్తి వడ్డీ రాయితీ (100%) లభిస్తుంది.
వార్షిక ఆదాయం రూ. 4.5-8 లక్షల మధ్య ఉన్న విద్యార్థులు రూ. 10 లక్షల వరకు తీసుకునే రుణాలపై 3% వడ్డీ రాయితీని పొందుతారు.
రూ. 7.5 లక్షల వరకు రుణాలపై ప్రభుత్వం 75% రుణ హామీని అందిస్తుంది.
Also Read:Gopichand: ఆగిందనుకున్న సినిమా మళ్ళీ మొదలైంది
ఎలా దరఖాస్తు చేయాలి?
ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన కింద విద్యా రుణం పొందడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు pmvidyalaxmi.co.in అనే PM విద్యాలక్ష్మి పోర్టల్‌ను సందర్శించడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం అన్ని ప్రధాన బ్యాంకులతో అనుసంధానించబడింది. ముఖ్యంగా, వడ్డీ రాయితీ మొత్తం ఈ-వోచర్ లేదా CBDC వాలెట్ ద్వారా నేరుగా లబ్ధిదారునికి అందిస్తారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!