Harmanpreet Kaur Says India Will Win the Women’s ODI World Cup 2025: వన్డే ప్రపంచకప్ 2025 గెలిచి ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించుతామని భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచకప్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే అని, ఈసారి తప్పక గెలుస్తాం అని చెప్పారు. 2017 ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్ అనంతరం చాలా విషయాలు మారిపోయాయని, అభిమానులు ఎంతగానో ఉత్సాహపరిచారన్నారు. యువరాజ్ సింగ్‌ను చూసినప్పుడల్లా తనకు చాలా…
IND vs ENG: శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నప్పుడే, మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. ముంబయి నుంచి బయలుదేరిన మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది. ఈ పర్యటన జూలై 28న మొదలవుతుంది. ఈ సిరీస్ భారత మహిళల జట్టుకు ఎంతో కీలకమైనది. ఎందుకంటే, సెప్టెంబర్‌లో జరగబోయే మహిళల వన్డే వరల్డ్‌కప్ ముందు, ఇంగ్లాండ్…
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానా మరోసారి చరిత్ర సృష్టించింది. స్మృతి 2019 తర్వాత తొలిసారిగా ICC మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో మంధానాకు 727 రేటింగ్ పాయింట్లు లభించాయి. ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాటాలీ స్కివర్ బ్రంట్ (719), దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వుల్వార్ట్ (719) లు ఉన్నారు.…
BCCI: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 2024-25 సీజన్ కోసం భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఈసారి మొత్తం 16 మంది మహిళా ప్లేయర్స్ కు BCCI కాంట్రాక్ట్ ఇచ్చింది. మహిళా క్రికెటర్లను మూడు గ్రేడ్లుగా విభజించారు. ఈ జాబితాలో ముగ్గురు క్రికెటర్లను గ్రేడ్ A లోకి, నలుగురుని గ్రేడ్ B లోకి, మిగిలిన 9 మందిని గ్రేడ్ C లోకి చేర్చారు. ఈ కాంట్రాక్ట్ 2024…
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం సాధించిన ఆర్‌సీబీ, రెండో మ్యాచ్‌లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది. సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండు మ్యాచ్ ల గెలుపుతో ఆర్‌సీబీ టాప్ స్థానంలో నిలిచింది. Read Also: Delhi New CM:…
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 మూడవ సీజన్ నేటి (ఫిబ్రవరి 14) నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ జెయింట్స్ (GG)తో తలపడనుంది. WPL 2025 మొదటి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో.. అలాగే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా ఎలా చూడగలరన్నా విశేషాలను చూద్దాం. WPL 2025 1వ మ్యాచ్ శుక్రవారం 14 ఫిబ్రవరి 2025న వడోదరలోని కోటంబి స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్…
Smriti Mandhana: 2024లో అన్ని ఫార్మాట్స్ లో అద్భుతంగా ఆడిన భారత బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా (ICC Women’s ODI Cricketer of the Year) ఎంపికైంది. విషయాన్నీ తాజాగా ఐసీసీ వెల్లడించింది. మంధాన వన్డేలలో కొత్త రికార్డ్స్ ను నెలకొల్పింది. 2024లో 13 ఇన్నింగ్స్‌లలో 747 పరుగులు చేసి క్యాలెండర్ ఇయర్లో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ పరుగులు చేసింది. Also Read:…
అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి 2024కు గాను బెస్ట్ ఉమెన్స్ టీ20 టీమ్ ను ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ICC మహిళల T20 జట్టులో చోటు దక్కించుకున్న వారిలో భారత ఉమెన్స్ టీమ్ విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్ మెన్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు ICC మహిళల T20I…
వన్డే క్రికెట్ చరిత్రలో భారత మహిళల జట్టు రికార్డు స్కోరు నమోదు చేసింది. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది. ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5. ఈ రికార్డును స్మృతి సేన బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా మహిళా క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. 2018లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 491/4 పరుగులు చేసింది. అంతర్జాతీయ…
రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. కేవలం 70 బంతుల్లోనే 100 పరుగులు సాధించి.. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. అంతేకాకుండా.. మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్లో 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాల్గవ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.