BCCI: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 2024-25 సీజన్ కోసం భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఈసారి మొత్తం 16 మంది మహిళా ప్లేయర్స్ కు BCCI కాంట్రాక్ట్ ఇచ్చింది. మహిళా క్రికెటర్లను మూడు గ్రేడ్లుగా విభజించారు. ఈ జాబితాలో ముగ్గురు క్రికెటర్లను గ్రేడ్ A లోకి, నలుగురుని గ్రేడ్ B లోకి, మిగిలిన 9 మందిని గ్రేడ్ C లోకి చేర్చారు. ఈ కాంట్రాక్ట్ 2024 అక్టోబర్ 1 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.
BCCI విడుదల చేసిన జాబితాలో గ్రేడ్ A లో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు. వీరు భారత జట్టుకు ప్రధాన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఈ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు 50 లక్షల రూపాయలు వార్షికంగా అందజేయనున్నారు. ఇక గ్రేడ్ B లో రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షెఫాలీ వర్మ చోటు దక్కించుకున్నారు. వీరికి సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ కింద లభించనుంది. అలాగే గ్రేడ్ C లో యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, తితాస్ సాధు, అరుందతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా చేత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రకర్ ఉన్నారు. వీరికి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు అందించనున్నారు.
Read Also: Minister Atchannaidu: రైతులు ఆందోళన వద్దు.. రూ.1.10 లక్షల వరకు సాయం..!
🚨 News 🚨
BCCI announces annual player retainership 2024-25 – Team India (Senior Women)#TeamIndia pic.twitter.com/fwDpLlm1mT
— BCCI Women (@BCCIWomen) March 24, 2025
బీసీసీఐ మహిళా, పురుష క్రికెటర్లకు ఒకే రకమైన మ్యాచ్ ఫీజును ఇస్తున్నప్పటికీ.. వార్షిక కాంట్రాక్ట్‌లో చాలా తేడా ఉంది. పురుష క్రికెటర్లకు A+ గ్రేడ్ కూడా ఉంది. ఇందులో ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు అందజేస్తారు. పురుషుల A గ్రేడ్‌లో 5 కోట్లు, B గ్రేడ్‌లో 3 కోట్లు, C గ్రేడ్‌లో 1 కోటి రూపాయలు అందిస్తారు. దీనితో ఈ కాంట్రాక్ట్ లిస్టుపై మహిళా క్రికెట్ అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. పురుషులకంటే మహిళా క్రికెటర్లకు తక్కువ మొత్తాన్ని కాంట్రాక్ట్ కింద చెల్లించడం న్యాయమా? అనే ప్రశ్నలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే, గత కొన్నేళ్లుగా మహిళా క్రికెట్‌కు బీసీసీఐ మరింత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నప్పటికీ, ఇంకా పురుష క్రికెట్‌తో సమానంగా చెల్లింపులు లభించే స్థాయికి చేరాల్సి ఉంది.