IND vs WI Super 8: వెస్టిండీస్‌కు భారత్ సుస్సు పోసుకోవాల్సిందే.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్
- వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- కరేబియన్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virender Sehwag Said India should fear West Indies in T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌ను అస్సలు లైట్ తీసుకోవద్దని, కరేబియన్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని సూచించాడు. అలానే విండీస్ జట్టులో ఒక్కడు నిలబడ్డా.. మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుందని భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. కరేబియన్లు బాదే సిక్సర్లకు భారత బౌలర్ల ప్యాంట్లు తడవడం ఖాయం అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. వీరూ గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.
భారత్-వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘2016లో భారత్‌కు వెస్టిండీస్ వచ్చింది. కరేబియన్లు వరల్డ్ కప్ గెలిచిన సందర్భం నాకు గుర్తుంది. ముఖ్యంగా కార్లోస్ బ్రాత్‌వైట్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వరుసగా నాలుగు సిక్సులు కొట్టిన దృశ్యం నేను ప్రత్యక్షంగా కామెంటరీ చేస్తూ చూసాను. ఆ ఇన్నింగ్స్ నన్నే ఆశ్చర్యపరిచింది. వెస్టిండీస్ ఆటగాళ్ల ప్రత్యేకత ఏంటంటే.. హిట్టింగ్ సామర్థ్యమే. విండీస్ జట్టులో దాదాపు ప్రతి ఆటగాడూ భారీ షాట్లు ఆడగలడు. అందుకే వారిని ఎదుర్కొనేప్పుడు భయం ఉండాల్సిందే. టీ20 ప్రపంచకప్ 2026లో ఇంకా బాగా ఆడుతున్నారు. అలాంటప్పుడు వారిని ఎదుర్కోవాలంటే టీమిండియాకు పూర్తి స్థాయి ప్రణాళిక అవసరం. ప్రత్యేక ప్రణాళిక ప్రకారమే వారిని కట్టడి చేయాలి’ అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-1 సూపర్ 8 మ్యాచ్‌లో ఈరోజు వెస్టిండీస్‌ను భారత్ ఢీకొట్టనుంది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ ఓడిపోవడం, జింబాబ్వేపై భారత్ ఘన విజయంతో.. సెమీ ఫైనల్ రేసులోకి వచ్చిన టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. మెగా టోర్నీలో రెండు జట్లు ఒక్క ఓటమే చవిచూశాయి. రెండు జట్ల బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ మార్చి 5న ముంబైలో జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలతో అభిమానులు భారత్–వెస్టిండీస్ పోరు కోసం మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌లో ఏ జట్టు ఆధిపత్యం చాటుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు