INDW vs SAW: బెంగళూరు వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల టీమ్ పై 4 పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
స్వదేశంలో సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా మహిళ బ్యాటర్లు భారీగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
భారత మహిళల క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా.. ఈరోజు మొదటి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన షఫాలీ వర్మ కేవలం (7) పరుగులు చేసి నిరాశపరచగా.. స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. 127 బంతుల్లో 117 పరుగులు చేసింది. ఆ తర్వాత.. దీప్తి శర్మ (37), పూజా…
దక్షిణాఫ్రికాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్ కు భారత మహిళల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.. డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరిస్తుంది. బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, స్పీడ్‌స్టర్ పూజా వస్త్రాకర్ మూడు స్క్వాడ్ లలో భాగంగా ఉన్నారు. అయితే వారు ఆడటం అనేది ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తో సిరీస్ ప్రారంభమవుతుంది. దాని…
Babar Azam, David Warner unsold in The Hundred 2024 Draft: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లకు మరోసారి చుక్కెదురైంది. ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ ‘ది హండ్రెడ్’ 2024 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఈ ఇద్దరు పాక్ ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. ది హండ్రెడ్ లీగ్‌లో వరుసగా మూడోసారి బాబర్, రిజ్వాన్‌లు అమ్ముడుపోకపోవడం విశేషం. ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్లు కూడా వేలంలో…
Smriti Mandhana on Virat Kohli To Win IPL Title: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తనకు మధ్య పోలిక సరికాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధన అన్నారు. టైటిల్ ముఖ్యమైందే కానీ భారత జట్టు తరఫున విరాట్ ఎన్నో సాధించాడన్నారు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ‘ఆర్సీబీ అన్‌బాక్స్’ పేరిట ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా…
RCB Captain Smriti Mandhana Says Ee Sala Cup Namdu: ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈ సారి కప్ మాదే) అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్లోకి రావడం.. ఉత్తి చేతులతోనే ఇంటికి వెళ్లడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పరిపాటుగా మారింది. టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌లలో విజయాలను అందించిన విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ప్రాంచైజీకి మాత్రం ఒక్క ట్రోఫీ కూడా ఇవ్వలేదు. గత 16 ఏళ్లలో మూడుసార్లు ఫైనల్ వరకు వచ్చి.. రన్నరప్‌గా నిలిచింది.…
Smriti Mandhana Photo With Boyfriend Palash Muchhal in WPL 2024 Final: డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఐపీఎల్లో గత 16 ఏళ్లుగా పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను.. మహిళల…
Virat Kohli Congratulations RCB after Win WPL 2024 Title: 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఆడుతోంది. ఐపీఎల్లో ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఇదే ఆర్సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అడుగుపెట్టింది. తొలి సీజన్లో అందరినీ నిరాశపరుస్తూ.. పట్టికలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఏడాది మహిళా జట్టు అద్భుతం చేసింది.…
Ellyse Perry Said I Can’t wait for the WPL 2024 Final: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్‌కు వెళ్లినందుకు ఆనందంగా ఉందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ అన్నారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం అని, స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారని ప్రశంసించారు. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా అని పెర్రీ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో…