Smriti Mandhana: భీకర ఫామ్ లో ఉన్న టీం ఇండియా ప్లేయర్ స్మృతి మందాన మరోసారి సెంచరీ సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో కేవలం 77 పంతుల్లోనే స్మృతి మందాన సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. టీమిండియా తరఫున రెండో అత్యంత వేగమైన సెంచరీని స్మృతి నమోదు చేసింది. మొహలి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో స్మృతి మందాన సెంచరీ సాధించింది. ఇక్కడ విశేషమేమిటంటే.. టీమిండియా తరఫున అత్యధిక తక్కువ బంతులతో సెంచరీ చేసిన రికార్డు కూడా స్మృతిదే కావడం.. ఇదివరకు ఐర్లాండ్ పై రాజ్‌కోట్‌లో కేవలం 70 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు సాధించింది.
Little Hearts Jai Krishna : టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడోచ్..
తాజాగా సాధించిన సెంచరీ ఆమెకు వన్డేలలో 12వ సెంచరీ. దీనితో ఇంగ్లాండు ప్లేయర్ టామీ బ్యూమాంట్‌తో సమానంగా నిలిచింది. అలాగే ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు సాధించిన స్మృతి, సుజీ బేట్స్‌తో కలిసి సమానంగా నిలిచింది. ఇకపోతే 2025లో స్మృతి మందాన ఏకంగా మూడు వన్డే సెంచరీలు పూర్తి చేసింది. ఓకే క్యాలెండర్ ఇయర్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే ఆస్ట్రేలియాపై వన్డేలలో అత్యధిక వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్ గా స్మృతి మందాన నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత ఇన్నింగ్స్ లో 91 బంతుల్లో 117 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది స్మృతి మందాన. మొత్తంగా టీమిండియా 49.5 ఓవర్లలో టీమిండియా 292 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
Asia Cup 2025: మదమా లేక అహంకారామా? షేక్ హ్యాండ్ వివాదంతో టోర్నీ నుండి పాకిస్తాన్ అవుట్?