Smriti Mandhana: సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం కానున్న ICC మహిళా వన్డే వరల్డ్‌కప్‌కు ముందు భారత క్రికెట్ స్టార్ స్మృతి మందాన ICC వన్డే మహిళా బ్యాట్స్‌మెన్ లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. ఇంగ్లండ్‌కు చెందిన నెట్ సివర్‌ను అధిగమించి ఈ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. దీనితో నెట్ సివర్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. స్మృతి మందాన తప్ప మరొక భారతీయ బ్యాట్స్ ఉమెన్ టాప్ 10లో చోటు సంపాదించలేకపోయారు.
Kishkindhapuri Villian: చిన్నపుడు 150 రూపాయలకి రోడ్లపై డాన్స్ చేశా!
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 58 పరుగులు చేయగా, ఆమెకు 7 రేటింగ్ పాయింట్స్ లభించాయి. దీంతో స్మృతి మందాన నెట్ సివర్ కంటే 4 పాయింట్లు ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఇదివరకు 2019లో కూడా స్మృతి మందాన వన్డే క్రికెట్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ గా అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు మల్లి ఆ స్థానానికి చేరుకుంది. వన్డే ర్యాంకింగ్‌లో స్మృతి మందాన తప్ప మరొక భారత బ్యాట్స్‌మెన్ టాప్ 10లో లేకపోయినా.. కొందరి ఆటగాళ్ల ర్యాంకింగ్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. స్మృతి మందాన ఓపెనింగ్ పార్ట్‌నర్ ప్రీతిక రావల్, మరొక బ్యాట్స్ ఉమెన్ ప్రీతిక రావల్ ర్యంకులు మెరుగయ్యాయి. మరోవైపు ICC మహిళా వన్డే బౌలర్ల ర్యాంకింగ్‌లో భారత ప్రాతినిధ్యం చేస్తున్నది దీప్తి శర్మ. ఆమె 3 స్థానాలు దిగజారిన, ఇప్పటికీ టాప్ 10లో 7వ స్థానాన్ని నిలబెట్టుకుంది. అలాగే, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్‌లో దీప్తి శర్మ నాలుగో స్థానాన్ని నిలుపుకుంది.
Sobhita Dhulipala : సాగర తీరాన చీరకట్టులో శోభిత ధూళిపాళ్ల.. లేటెస్ట్ ఫొటోస్