Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానా మరోసారి చరిత్ర సృష్టించింది. స్మృతి 2019 తర్వాత తొలిసారిగా ICC మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో మంధానాకు 727 రేటింగ్ పాయింట్లు లభించాయి. ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లండ్ కెప్టెన్ నాటాలీ స్కివర్ బ్రంట్ (719), దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వుల్వార్ట్ (719) లు ఉన్నారు.
Read Also: Kagiso Rabada: జట్టుకోసం రక్తాన్ని ఇవ్వడానికైనా సిద్ధం.. దక్షిణాఫ్రికా బౌలర్ భావోద్వేగం..!
2019లో చివరిసారిగా నెంబర్ 1 స్థానం నిలబెట్టుకున్న మంధానా, ఆ తర్వాత కూడా టాప్ 10లో కొనసాగినా.. తిరిగి అగ్రస్థానం దక్కించుకోవడానికి ఆరేళ్ళ సమయం పట్టింది. కొలంబోలో ముగిసిన ట్రై సిరీస్ వన్డే టోర్నమెంట్ ఫైనల్లో మంధానా శతకంతో రాణించారు. ఇది ఆమె కెరీర్‌లో 11వ వన్డే శతకం. ఈ ప్రదర్శన ఆమె రేటింగ్ పాయింట్లను పెంచేందుకు బాగా సహాయపడింది. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వుల్వార్ట్ వెస్టిండీస్‌పై రెండు వన్డేల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేయడంతో ఆమె ర్యాంకింగ్ దిగజారింది.
Read Also: Jasprit Bumrah: ఎట్టకేలకు టెస్టు కెప్టెన్ ఎంపికపై మౌనం వీడిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే..?
మంధానా తర్వాత భారత జట్టులోని బ్యాటర్లు జెమీమా రొడ్రిగ్స్ 14వ స్థానంలో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15వ స్థానంలో ఉన్నారు. అలాగే, మంధానా టీ20 ర్యాంకింగ్స్‌లోనూ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ నెలలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో మంధానా ఫామ్‌ను కొనసాగిస్తే ఆమె ఆగ్రా స్థానాన్ని మరికొన్ని రోజులు పటిష్టంగా నిలబెట్టుకోవచ్చు.