Smriti and Palash: టీమిండియా మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో వారు వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (29), సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (30)ల వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో జరగాల్సిన పెళ్లి.. మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలు సోషల్ మీడియాలో ప్రకటించాయి. శ్రీనివాస్ గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో చేరారని పలాశ్, మంధాన కుటుంబాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటికోచ్చింది. మంధానని పలాశ్ మోసం…
టీమిండియా స్టార్ ఓపెనర్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌ల వివాహం వాయిదా పడింది. ఈ విషయాన్ని పలాశ్ సోదరి పలాక్ ముచ్చల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేశారు. వివాహం విషయంలో ఇరు కుటుంబాల గోప్యతను ప్రతిఒక్కరు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ‘స్మృతి మంధాన నాన్న గారికి అనారోగ్యం కారణంగా.. పలాశ్ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సున్నితమైన విషయంలో అందరూ మా కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నా’ పలాక్ పేర్కొన్నారు.…
Smriti Mandhana: టీమిండియా స్టార్ క్రికెటర్, ఇటీవల ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యులలో ఒక్కటైన స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) ఆమె వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు పలాష్ ఆమెకు ప్రపోజ్ చేసిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో సినిమాటిక్ ప్రపోజల్ ఈ జంటకు సంబంధించిన ఓ రొమాంటిక్ వీడియోను పలాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.…
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్, వరల్డ్ కప్ విజేత స్మృతి మంధాన (Smriti Mandhana) తన అభిమానులకు తీపి కబురు తెలిపింది. తన చిరకాల మిత్రుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) తన నిశ్చితార్థం (Engagement) జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ఆమె చాలా సరదాగా, వినూత్నంగా ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా పంచుకోవడం విశేషం. Ashes Series 2025: యాషెస్ సమరానికి సై.. పెర్త్ వేదికగా నేటి…
World Cup: భారత మహిళ క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఓడించింది. అయితే, ఈ విజయం ఎఫెక్ట్‌లో మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం, బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు ఏకంగా 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.
ICC Rankings: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ను టీమిండియా గెలిచిన సంగతి విధితమే. ఇక బిగ్ టోర్నమెంట్ ముగియడంతో ఐసీసీ (ICC) మహిళల వన్డే (ODI) ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (Laura Wolvaardt) ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు ప్రదర్శనతో ఏకంగా నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. టోర్నమెంట్‌కు ముందు అగ్రస్థానంలో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధానను వోల్వార్ట్ అధిగమించి…
World Cup Team of the Tournament: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయం తర్వాత ఐసీసీ (ICC) ప్రకటించిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు ఆధిపత్యం చెలాయించారు. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత త్రయం స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు స్థానం సంపాదించారు. ఈ ముగ్గురూ జట్టు తొలి ప్రపంచకప్ విజయంలో అద్భుతమైన పాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్…
Richest Female Cricketers: నవీ ముంబై వేదికగా నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ విజయం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సాధించిన ఈ విజయం కేవలం భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక క్రీడా మైలురాయిగా మాత్రమే కాకుండా.. అనేక సంవత్సరాల కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఆశల మిళితంగా నిలిచింది. భారత్ ఈ ట్రోఫీని ఎత్తగానే దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంతో…
Sportsmanship: క్రీడల్లో విజయంలో వినయం, ఓటమిలో సౌమ్యత ఉండాలనే నినాదాన్ని భారత మహిళల జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాపై ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన తర్వాత అద్భుతంగా ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో తమ జట్టు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో భారత క్రీడాకారులు మునిగితేలుతుండగా.. ఓటమి బాధతో కన్నీరు పెట్టుకుంటున్న దక్షిణాఫ్రికా క్రీడాకారులను చూసి భారత ప్లేయర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. విజయోత్సవ సంబరాలను పక్కన పెట్టి భారత క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సహా…