World Cup 2025: అన్ని మారాయి.. వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం: టీమిండియా కెప్టెన్
- సెప్టెంబరు 30 నుంచి వన్డే ప్రపంచకప్ 2025
- వన్డే ప్రపంచకప్ 2025 ట్రోఫీ ఆవిష్కరణ
- ఐసీసీ ట్రోఫీ తప్పక గెలుస్తామంటున్న హర్మన్‌ప్రీత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur Says India Will Win the Women’s ODI World Cup 2025: వన్డే ప్రపంచకప్ 2025 గెలిచి ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించుతామని భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచకప్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే అని, ఈసారి తప్పక గెలుస్తాం అని చెప్పారు. 2017 ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్ అనంతరం చాలా విషయాలు మారిపోయాయని, అభిమానులు ఎంతగానో ఉత్సాహపరిచారన్నారు. యువరాజ్ సింగ్‌ను చూసినప్పుడల్లా తనకు చాలా ప్రేరణ లభిస్తుందని హర్మన్‌ప్రీత్ చెప్పారు. సోమవారం వన్డే ప్రపంచకప్ 2025 ట్రోఫీని ముంబైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా, మాజీ ప్లేయర్ యువరాజ్‌సింగ్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లతో పాటు హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ… ‘భారతీయులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న అడ్డంకిని మేం బద్దలు కొడతాం. ప్రపంచకప్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. యువరాజ్ సింగ్‌ను చూసినప్పుడల్లా నాకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. ఆస్ట్రేలియాతో ఆడటం సవాల్‌తో కూడుకున్నదే. మెగా టోర్నీకి ముందు ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడడం కలిసొస్తుంది. మేం చాలా కష్టపడుతున్నాం. 2017 ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన ఇన్నింగ్స్ (171) నాకు ఎంతో ప్రత్యేకం. ఆ మ్యాచ్ తర్వాత చాలా విషయాలు మారిపోయాయి. ఫైనల్లో ఓడిపోయి తిరిగొచ్చినా మాకు ఘన స్వాగతం దక్కింది. ఈసారి వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం’ అని చెప్పారు.
Also Read
Also Read: Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్!
మరో 50 రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది. సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు జరిగే ప్రపంచకప్ జరగనుంది. మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. సెప్టెంబరు 14 నుంచి 20 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్‌కు ఆస్ట్రేలియా రానుంది. భారత మహిళల జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్ గెలవలేదు. విజయానికి దగ్గరగా వెళ్లి తుది మెట్టుపై బోల్తా పడ్డారు. 2017 ప్రపంచకప్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ గెలవాలని భారత్ చూస్తోంది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!