IND vs AUS: న్యూ చండీగఢ్‌లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్టు మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 102 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంతో మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత వైస్-కెప్టెన్ స్మృతి మందాన తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 91 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 117 పరుగులు చేసింది.
4K QLED డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్, గూగుల్ టీవీ ఫీచర్లతో వచ్చేసిన Kodak Matrix Series టీవీలు!
ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 292 పరుగులకు పరిమితమైంది. మందాన సెంచరీతో పాటు దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతీక రావల్ (25), స్నేహ్ రాణా (24) కూడా విలువైన పరుగులు అందించారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3 వికెట్లు తీసుకోగా, ఆష్లీ గార్డ్‌నర్ 2 వికెట్లు, అన్నాబెల్ సదర్‌లాండ్, మెగాన్ షుట్, తహ్లియా మెక్‌గ్రాత్ చెరొక వికెట్ తీశారు.
PM Modi: ప్రధాని మోడీని పాకిస్తాన్ ఎందుకు ప్రమాదంగా చూస్తోంది..? కారణాలు ఏంటి.?
ఇక 293 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 40.5 ఓవర్లలో కేవలం 190 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ (44), అన్నాబెల్ సదర్‌లాండ్ (45) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 28 పరుగులకే 3 వికెట్లు తీసి అద్భుతంగా రాణించింది. దీప్తి శర్మ 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ఈ విజయం ఆస్ట్రేలియాపై స్వదేశంలో భారత్‌కు 2007 తర్వాత మొదటి వన్డే విజయం. దీంతో ఆస్ట్రేలియా యొక్క 13 వరుస వన్డే విజయాల పరంపర ముగిసింది. స్మృతి మందాన తన సెంచరీకి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డును అందుకుంది. ఈ విజయం సిరీస్ డిసైడర్‌కు వేదికను సిద్ధం చేసింది. చివరి మ్యాచ్ శనివారం ఢిల్లీలో జరగనుంది.