Women Youtuber : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర సందడిగా కొనసాగుతోంది. ఈ పవిత్ర జాతరలో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ జాతర విశేషాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించేందుకు, యూట్యూబర్ గ్యాంగ్ జాతర ప్రాంతానికి వచ్చింది. జాతరలో జనసందోహం మధ్య వీడియోలు చిత్రీకరిస్తుండగా, కొన్ని సార్లు భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు భావించి, కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో…
Komuravelli Mallanna Jatara 2025: కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర ఈరోజు (జనవరి 19) నుంచి ప్రారంభం కానుంది. అయితే, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగియనుంది.
Ponnam Prabhakar : త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలనే సంకల్పంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఆయన సూచించారు. గురువారం, సిద్ధిపేట జిల్లాలోని కోహెడ్ లో పర్యటించిన ఆయన, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ఈ సమావేశంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ప్రస్తుతం నుంచే పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా…
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. గాలిపటం ఎగరవేస్తూ చెరువులో పడి చనిపోయాడు. లెక్చరర్స్ కాలనీలో ఉండే తేజ (11) గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు గాలిపటం దారం తెగిపోయి.. సమీపంలో ఉన్న చెరువులో పడింది. దీంతో.. గాలిపటం కోసం వెళ్లిన ఆ బాలుడు మృత్యుఒడిలోకి వెళ్లిపోయాడు.
ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ దారుణాలకు సోషల్ మీడియా కారణం కావడం అత్యంత బాధాకరం. తాజాగా సోషల్ మీడియా ప్రేమ ఓ ఫోక్ సింగర్ ప్రాణం తీసింది.
Harish Rao : నిన్న ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్…
Hit and Run: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది.
సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ను ప్రారంభించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో కోకాకోలా కంపెనీని నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Revanth Reddy: నేడు సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్ధిపేటకు వెళ్లనున్నారు.